Leading News Portal in Telugu

Flipkart Big Billion Days 2023: ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్’ బిలియన్ ఆఫర్.. 20 వేల స్మార్ట్‌ఫోన్ కేవలం 10 వేలకే!


Flipkart Big Billion Days 2023 Offers and DIscounts: ఇటీవలి రోజుల్లో ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ వరుస సేల్‌లతో వినియోగదారుల ముందుకు వస్తోంది. ఇప్పటికే ఏ ఏడాదిలో ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’, ‘బిగ్ బిలియన్ డేస్’, ‘గ్రాండ్ హోమ్ అప్లియెన్సెస్ సేల్’, ‘బిగ్ బచాత్ ధమాల్ సేల్’ను నిర్వహించిన ఫ్లిప్‌కార్ట్.. తాజాగా మరో సేల్‌ను ప్రకటించింది. ‘బిగ్ బిలియన్ డేస్’ను మరోసారి ఫ్లిప్‌కార్ట్ తీసుకొస్తుంది. ఇందుకు సంబందించిన టీజర్ పేజ్ ఇప్పటికే వెబ్‌సైట్‌లోకి వచ్చేసింది. ఈసారి ఏఏ ఆఫర్స్ ఉండనున్నాయో ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఎప్పటిలానే ఈసారి కూడా అన్ని స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ 2023 త్వరలోనే ఆరంభం కానుంది. ఈ సేల్‌లో శాంసంగ్‌, వివో, రియల్‌మీ, పోకో, మోటోరోలా, షావోమీ, నథింగ్, ఇన్ఫీనిక్స్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి. 0 శాతం వడ్డీతో ఈఎంఐ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో ఈ ఆఫర్ పొందొచ్చు. ఈఎంఐ కేవలం రూ. 999 నుంచే ఆరంభం అవుతుంది. 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు, 12 నెలల నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్స్ కూడా ఉన్నాయి. భారీగా ఎక్స్‌ఛేంజ్‌ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది.

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్‌ 2023లో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కొటక్ బ్యాంక్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డులతో 10 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు. మరోవైపు పేటీఎం, యూపీఐ, వ్యాలెట్స్ ద్వారా కొనుగోలు చేసేవారికి అదనపు తగ్గింపు ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఫీచర్ కూడా ఈ సేల్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌తో బయ్ నౌ, పే లేటర్ ఆఫ్షన్ మీరు ఎంచక్కా ఉపయోగించుకోవచ్చు.

బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ. 19,999 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ. 9,999కే సొంతం చేసుకోవచ్చు. ఓ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ. 19,999గా ఉంటే.. ఈ సేల్‌లో ఆ ఫోన్ రూ. 15,999కి అందుబాటులో ఉంటుంది. పాత మొబైల్ ఎక్స్‌ఛేంజ్‌ చేస్తే.. అదనంగా రూ. 5,000 తగ్గింపు లభిస్తుంది. బ్యాంక్ డిస్కౌంట్ రూ. 1,000 పొందొచ్చు. అప్పుడు ఆస్మార్ట్‌ఫోన్‌ మీకు కేవలం రూ. 9,999 లభిస్తుంది. ఇక నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే.. నెలకు రూ. 2,499 చెల్లిస్తే చాలు.