Leading News Portal in Telugu

Odisha News: తినే ఆహారంలో చనిపోయిన కప్ప.. చూసి కంగుతున్న విద్యార్థులు


Odisha News: ఒడిశాలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. రాజధాని భువనేశ్వర్‌లోని కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ ఫుడ్‌లో చనిపోయిన కప్ప దర్శనమిచ్చింది. ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు వడ్డించిన ఆహారంలో చనిపోయిన కప్ప కనిపించడంతో విద్యార్థులు కంగుతిన్నారు. అయితే ఈ విషయాన్ని ఓ విద్యార్థి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ సంఘటన జరిగిన KIIT భువనేశ్వర్ భారతదేశంలోని ఇంజనీరింగ్ కాలేజీలలో 42వ స్థానంలో ఉందని ఆయన పోస్ట్‌లో రాశారు. ఇక్కడ తల్లిదండ్రులు తమ పిల్లలకు డిగ్రీ చదివించేందుకు దాదాపు రూ.17.5 లక్షలు వెచ్చిస్తున్నారని తెలిపాడు. ఆ విద్యార్థి పోస్ట్ చేసిన ఫోటోలో ఆహారంలో కప్ప పడి ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ పోస్ట్ తర్వాత.. కళాశాల సర్క్యులర్‌పై విద్యార్థి మరో అప్‌డేట్‌ను పోస్ట్ చేశాడు. మెస్ కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఆహారం పూర్తిగా అపరిశుభ్రంగా ఉందని, మధ్యాహ్న భోజనంపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారని అందులో రాసి ఉంది. దీంతో సదరు కాంట్రాక్టర్‌కు ఒకరోజు జీతం కట్‌ చేయాలని మెస్‌ అధికారులు నిర్ణయించారు. అంతేకాకుండా.. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని హాస్టల్ కాంట్రాక్టర్‌ను హెచ్చరించింది.