Leading News Portal in Telugu

Bihar: 3 అడుగుల భూమి కోసం గొడవ.. ఓ వ్యక్తి చెవి కోసేసిన రౌడీలు


Bihar: బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. 3 అడుగుల భూమి విషయంలో ఓ వ్యక్తిని చితకబాది.. అనంతరం చెవి కోసేశారు. గ్రామానికి చెందిన కొందరు బడా బాబులు తన భూమిని కబ్జా చేసేందుకు యత్నించారు. దీంతో బాధితుడు నిరసన తెలపడంతో అతనిపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన విజయ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొరియా గ్రామంలో చోటుచేసుకుంది. గాయపడిన బాధితుడు నింబు లాల్ గోండ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తన మూడెకరాల భూమిని ఆక్రమించుకున్నారని బాధితుడు ఆరోపించాడు. అప్పుడు కూడా తనపై దాడి చేశారని తెలిపాడు. తాజాగా తన ఇంటి స్థలం విషయంలో మరోసారి దాడి చేసి చెవి కోసేశారు. ఇంటి పక్కనే 3 అడుగుల భూమి ఉందని.. దానిని కొందరు బడా నేతలు కబ్జా చేశారు. అయితే తన భూమిని ఎందుకు తీసుకుంటున్నారని అడిగినందుకు ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఇదిలా ఉంటే.. రౌడీలపై చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశాడు. అయితే ఈ వ్యవహారంపై పోలీసులు ఎలాంటి ఫిర్యాదు నమోదు చేయకపోగా. నిందితులను ఎవరినీ అరెస్టు చేయలేదు. మరోవైపు ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్వర్ణ్ ప్రభాత్ తెలిపారు.

ఇంతకుముందు కూడా తనతో 3 అడుగుల భూమి విషయంలో రౌడీలు గొడవపడ్డారని నింబు లాల్ చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులు కూడా కేసు నమోదు చేశాడని తెలిపాడు. గతంలో ఈ కేసులో జైలుకు కూడా వెళ్లానని.. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత రౌడీలు కొట్టారని ఆరోపించాడు. అయితే ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.