Leading News Portal in Telugu

Chandrababu : చంద్రబాబు పిటిషన్‌పై రేపు సుప్రీంలో విచారణ


న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా సుప్రీంకోర్టులో మెన్షన్ చేశారు. చంద్రబాబు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని, అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. అయితే రేపు మెన్షన్ లిస్ట్ ద్వారా రావాలని సీజేఐ వారికి చెప్పారు. చంద్రబాబు ఎన్ని రోజుల నుంచి కస్టడీలో ఉన్నారని సీజేఐ అడిగారు. రేపు మెన్షన్ లిస్టులో పూర్తిగా వింటామని చెప్పారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని లూథ్రా వాదించారు. ఇది ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యవహారం అని… అక్కడ ప్రతిపక్షాలను అణిచివేస్తున్నారని సిద్దార్థ లూథ్రా చెప్పారు. ఎన్ని రోజుల నుంచి కస్టడీలో ఉన్నారని సీజేఐ అడుగగా.. ఈనెల 8న అరెస్టు చేశారని లూథ్రా చెప్పారు. దీంతో రేపు మెన్షన్‌ లిస్ట్‌ ద్వారా రావాలని సీజేఐ సూచించారు. ఏపీ ప్రభుత్వం తరపున హైకోర్టులో వాదించిన ముకుల్ రోహత్గీ, సీఐడీ తరపున వాదించిన రంజిత్ కుమార్‌లు కూడా సుప్రీంకోర్టుకు హాజరయ్యారు.

ఇదిలా ఉంటే.. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు అక్టోబర్ 5 వరకు రిమాండ్ పొడిగించిన నేపథ్యంలో ఆయన తరఫు లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కాసేపట్లో దీనిపై విచారణ జరగనుంది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ ప్రమోద్ దూబే వాదనలు వినిపించనున్నారు. టీడీపీ లీగల్ సెల్ అంతా ఏసీబీ కోర్టుకు చేరుకుంది. కస్టడీ పొడిగింపు పిటిషన్‌పై తమ వాదనలు కూడా వినాలని చంద్రబాబు తరపు న్యాయవాది పోసాని నిన్ననే కోరారు. ఈ రోజు మెమోపై కోర్టు విచారించే అవకాశం ఉంది. అలాగే చంద్రబాబుపై ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులలో పిటీ వారెంట్‌లపై కూడా విచారించాలని సీఐడీ కోరింది. బెయిల్ పిటీషన పైన సమయం కావాలని సీఐడీ కోరుతున్నట్లు తెలుస్తోంది.