Leading News Portal in Telugu

Kishan Reddy: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై తమిళిసై నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..


గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించింది. గత కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీలో చేరిన దాసోజు శ్రవణ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాల సిఫార్సులను తమిళిసై తిరస్కరించడంపై అధికార బీఆర్ఎస్ నేతలు గవర్నర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, గవర్నర్ తమిళిసైకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సపోర్ట్ గా నిలిచాడు. కవులు, కళాకారులు, సేవ చేసే వారికి గవర్నర్, రాష్ట్రపతి కోటాలో అవకాశం కల్పిస్తారు.

కానీ, కేసీఆర్ క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తులను నియమించాలని ప్రకటిస్తున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబానికి పని చేసే వారికి ఎమ్మెల్సీ అడుగుతున్నారు.. పార్టీలు ఫిరాయించిన వారు.. కేసీఆర్ కుటుంబానికి సేవ చేసే వారిని గవర్నర్ రిజెక్ట్ చేయడం మంచి నిర్ణయం.. సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కు ప్రధాని నరేంద్ర మోడీ ఎంపీగా అవకాశం కల్పించారు.. ఆయనతో పాటు పీటీ ఉషను రాజ్యసభకు నామినేట్ చేశారు కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీకి సంబంధం లేని వ్యక్తిని ప్రధాని నరేంద్ర మోడీ నామినేట్ చేశారు అని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు. గవర్నర్.. గవర్నర్ గా వ్యవహారించారు కాబట్టే.. ఎమ్మెల్సీలను రిజెక్ట్ చేశారు.. కేసీఆర్ కు వత్తాసు పలికితే మంచివారు.. లేదంటే చెడ్డ వాళ్ళా అని ఆయన ప్రశ్నించారు.