ఆసియా క్రీడలు 2023లో టెన్నిస్‌లో పతకం సాధించాలన్న భారత్ ఆశలు ఆవిరయ్యాయి. ఇండియా నంబర్-1 పురుషుల టెన్నిస్ జంట రోహన్ బోపన్న, యుకీ భాంబ్రీలు మొదటి రౌండ్లోనే ఓటమి పాలయ్యారు. దీంతో వారు పతకాన్ని గెలుచుకునే రేసుకు దూరంగా ఉన్నారు. ఈ భారత జోడీ తక్కువ ర్యాంక్ ఉన్న ఉజ్బెకిస్థాన్ జోడీపై ఓడిపోయింది.
Google Pixel 8 Launch: అదిరిపోయిన గూగుల్ పిక్సెల్ 8 ఫీచర్లు.. త్వరలో లాంచ్
రోహన్ బోపన్న, యుకీ భాంబ్రీ జోడీ 6-2, 3-6, 6-10తో ఉజ్బెకిస్థాన్ పురుషుల జోడీ ఖుమోయున్-ఫోమిన్ చేతిలో ఓడిపోయింది. డబుల్స్‌లో టాప్-10 ఆటగాళ్లలో బోపన్న ఉండగా.. టాప్-19లో భాంబ్రీ ఉన్నాడు. అయితే ఉజ్బెకిస్థాన్ ఆటగాళ్లు ఇద్దరూ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో టాప్ 300లో కూడా లేరు. ఇదిలా ఉంటే.. మహిళా టెన్నిస్ క్రీడాకారిణి అంకితా రైనా మహిళల సింగిల్స్ ఈవెంట్లో ప్రీ-క్వార్టర్ఫైనల్లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. రైనా 6-0, 6-0తో ఉజ్బెకిస్థాన్ ప్లేయర్‌ను ఓడించి తదుపరి రౌండ్లోకి ప్రవేశించింది.
Kiran Abbavaram: ఖైరతాబాద్ గణేష్ ఆశీస్సులు తీసుకున్న రూల్స్ రంజన్..
ఇదిలా ఉంటే.. ఆసియా క్రీడలు 2023లో భారత్ ఇప్పటివరకు 11 పతకాలు సాధించింది. ఇందులో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్, మహిళల క్రికెట్ ఈవెంట్లలో భారత్ స్వర్ణం సాధించింది. ఇవే కాకుండా ఇప్పటి వరకు భారత్ 3 రజతాలు, 6 కాంస్య పతకాలు సాధించింది. పురుషుల లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్, పురుషుల కాక్స్డ్ 8 టీమ్ రోయింగ్‌లో భారత్ రజతం సాధించింది. ఈసారి ఆసియా గేమ్స్‌లో అథ్లెట్ల నుండి దేశం కనీసం 100 పతకాలు సాధిస్తుందని భావించింది. అదే జరిగితే ఇప్పటివరకు ఆసియా క్రీడలలో భారతదేశం అత్యుత్తమ ప్రదర్శన అవుతుంది.