Leading News Portal in Telugu

Smriti Mandhana: జాతీయ గీతాలాపన సమయంలో చాలా ఎమోషనల్ అయ్యా..


Smriti Mandhana: సెప్టెంబర్ 25 భారతదేశానికి చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఆసియా క్రీడలు 2023లో భాగంగా.. ఉదయం షూటింగ్‌లో దేశానికి తొలి బంగారు పతకం లభించింది. ఆ తర్వాత మహిళల క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత జట్టు 19 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేసింది. ఈ విజయాన్ని చాలా స్పెషల్‌గా అభివర్ణిస్తూ.. జాతీయ గీతాలాపన సమయంలో తాను చాలా ఎమోషనల్ అయ్యానని చెప్పింది.

భారత మహిళా క్రికెట్ జట్టు తొలిసారిగా ఆసియా క్రీడల్లో పాల్గొంది. అయితే ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 20 ఓవర్లలో 116 పరుగులు చేసింది. అనంతరం బౌలర్ల అద్భుత ఆటతీరుతో శ్రీలంకను 20 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో టీమిండియా పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా స్మృతి మంధాన మాట్లాడుతూ.. జాతీయ గీతాలాపన సమయంలో జెండా ఎగురవేస్తున్నప్పుడు తన కళ్లలో నీళ్లు తిరిగాయని చెప్పింది. ఇది చాలా ప్రత్యేకమైన క్షణం అని అన్నారు. నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచినప్పుడు మనం టీవీల్లో చూశాం.. ఇప్పుడు ఉమెన్స్ క్రికెట్ టీం కూడా స్వర్ణం గెలిచిందని.. ఇది చాలా ప్రత్యేకమైనదిగా తాను భావిస్తున్నానని తెలిపింది. తాను చాలా సంతోషంగా ఉన్నానని.. చాలా గర్వంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.