బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్. ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అర్జున్‍రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాని తెరకెక్కిస్తుండడంతో ఈ మూవీకి భారీగా క్రేజ్ ఏర్పడింది.ఈ సినిమా డిసెంబర్ 1వ తేదీన హిందీ, తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.. కాగా, ఈ సినిమా టీజర్‌ను మూవీ యూనిట్ విడుదల చేయబోతుంది.. యానిమల్ మూవీ టీజర్ సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నారు.కాగా, నేడు టీజర్ సెన్సార్ కూడా పూర్తయింది. దీంతో రన్ టైమ్ వివరాలు బయటికి వచ్చాయి..రణ్‍బీర్ పుట్టిన రోజు సందర్భంగా ‘యానిమల్’ టీజర్ సెప్టెంబర్ 28వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారికంగా వెల్లడించింది. యానిమల్ టీజర్ రన్ టైమ్ 2 నిమిషాల 29 సెకన్లు ఉండనుంది. ఈ టీజర్‌కు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది.
ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటిస్తున్న విషయం తెలిసిందే.ఇటీవలే ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది..అలాగే, ఇప్పటికే టీజర్ చూసిన కొందరు రివ్యూస్ ఇస్తున్నారు. టీజర్ అద్భుతంగా ఉందని, చూసిన తర్వాత మాటల్లేవని ట్వీట్స్ కూడా చేస్తున్నారు. రణ్‍బీర్ కపూర్ యాటిట్యూడ్, లుక్ అదిరిపోయాయని వెల్లడిస్తున్నారు. ఈ టీజర్ చూసి ఆశ్చర్యపోవడం ఖాయమని కూడా చెబుతున్నారు.. మొత్తంగా యానిమల్ టీజర్‌కు భారీ హైప్ ఏర్పడుతోంది. టీజర్ రాకముందే యానిమల్ టీజర్ హ్యాష్‍ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. యానిమల్ టీజర్లో ఎక్కువ టైమ్ రణ్‍బీర్ కపూర్, బాబీ డియోల్ కనిపిస్తారని సమాచారం.ఈ మూవీలో అనిల్ కపూర్, బాబీడియోల్, రష్మికా మందన్నా, త్రిపి దిమ్రీ, శక్తి కపూర్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు మనన్ భరద్వాజ్, హర్షవర్ధన్, రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. టీ సిరీస్ ఫిల్మ్స్ మరియు భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్ సంయుక్తంగా యానిమల్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు