mineral water: ఈ సృష్టిలోని పంచబోతాలల్లో నీరు ఒకటి. ఆహరం లేకుండా నెల వరకు బ్రతక వచ్చు. కానీ.. నీరు లేకుండా వారం బ్రతకడం కూడా కష్టమే. అందుకే నీరు ఉన్న భూమి మీద మాత్రమే జీవం ఉంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూమి లాంటి గ్రహం ఉందేమో అనే కోణంలో పరిశోధనలు చేస్తున్నారు. ప్రధానంగా నదులు, బావులు, బోర్లు ప్రధాన నీటివనరులు. రెండు దశాబ్దాల ముందు వరకు ప్రజలు ఆ నీళ్లనే త్రాగడానికి మరియు వంటకి ఉపయోగించేవాళ్ళు. కానీ ప్రస్తుతం పెరిగిన కాలుష్యం కారణంగా ఆ నీళ్ళని వినియోగించుకునే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం చాలమంది మినరల్ వాటర్ ని వినియోగిస్తున్నారు. అయితే మినరల్ వాటర్ ని వంటకి ఉపయోగిచ వచ్చా? అంటే.. ఉపోయోగించవచ్చు. మరి మినరల్ వాటర్ తో వంటచేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూదాం.
Read also:Chalo Rajahmundry : వాహనాల తనిఖీలు ముమ్మరం.. ఆంధ్ర చెక్ పోస్టులో అలర్ట్
మినరల్ వాటర్ లో మెగ్నీషియం, కాల్షియం, సోడియం, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. కావున శరీరానికి కావాల్సిన సూక్ష్మ పోషకాలు అందుతాయి. ఇక మినరల్ వాటర్ తో వంట చేయడం వల్ల ఆహరం ఎక్కువ సేపు తాజాగా ఉంటుంది. ఆహారానికి రుచి పెరుగుతుంది. అలానే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఆందోళనను తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. శరీరంలోని చెడు కొవ్వుని తగ్గిస్తుంది. కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలో గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గిస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలుగుతుంది. చర్మం కాంతివంతంగా ఉంటుంది. గుండె జబ్బుల్ని తగ్గిస్తుంది.