Health: నీటిని వేడి చేసి తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది అని మన పెద్దలు చెప్తుంటారు. అయితే ఒకప్పుడు నది, బావి, చెరువు మొదలైన నీటి వనరుల నుండి లభించే నీటిని ప్రజలు తాగేవాళ్ళు. అయితే మారిన కాలంతో పెరిగిన టెక్నాలజీతో.. కలుషితమైన నీటి వనరుల నుండి నీటిని సేకరించి వాటిని శుద్ధి చేసి మినరల్స్ ని కలిపి మనకి మార్కెట్లో విక్రయిస్తున్నారు. మనం ఆ నీటిని తాగడానికి ఉపయోగిస్తున్నాం. అయితే వర్షాకాలం లేదా శీతాకాలంలో మనకి జలుబు చేస్తుంది. గొంతు నొప్పిగా అనిపిస్తుంది అలాంటప్పుడు వేడి నీరు తాగాలి అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి వచ్చే సందేహం మినరల్ వాటర్ ని వేడి చేసి తాగవచ్చా? అలా వేడి చేయడం వల్ల అందులోని మినరల్స్ వెళ్లిపోతాయి? అనే డౌట్ ని ఇప్పుడు క్లియర్ చేసుకుందాం.
Read also:healthy water: మినరల్ వాటర్, డిస్టిల్డ్ వాటర్ మధ్య తేడా ఏంటి? డిస్టిల్డ్ వాటర్ తాగితే ఎం అవుతుంది..?
సాధారణంగా మినరల్ వాటర్ అంటే భూగర్భ జలాలను సేకరించి శుద్ధి చేస్తారు. ఇలా శుద్ధి చేసే సమయంలో అందులో ఉండే అధిక భాస్వరం వంటి లవణాలు విడుదల అవుతాయి. కానీ ఇతర పోషకాలు విడుదల కావు. ఈ పక్రియ ముగిసాక అందులో మరికొన్ని అవసరమైన ఖనిజాలు కలుపుతారు. ఈ నీరు సాధారణ మంచి నీళ్ల లాగే ఉంటుంది. కనుక వేడి చేయడం వల్ల ఎలాంటి పోషకాలు విడుదల కావు. కావున సందేహం లేకుండా మినరల్ వాటర్ ని వేడి చేసి ఆ వేడి నీటిని తాగవచ్చు.