Leading News Portal in Telugu

Jewellery Shop: జ్వువెలరీ షోరూం గోడకు కన్నం వేసి.. రూ. 25 కోట్లు నగలు దోపిడీ


Thieves Drill hole into Wall of jewellery Shop in Delhi దేశ రాజధాని ఢిల్లీలోని జంగ్‌పురాలోని భోగల్‌లో ఓ భారీ చోరీ జరిగింది. ఢిల్లీలోని భోగల్‌లోని ఉమ్రావ్ జ్యువెలర్స్ షోరూంలో అర్థరాత్రి దొంగలు చొరబడి సుమారు రూ.25 కోట్ల విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు. చాలా సేపు పక్కా ప్రణాళికతో జ్యువెలరీ షోరూం పైకప్పుకు, గోడకు రంధ్రాలు చేసి స్ట్రాంగ్‌రూమ్‌లోకి దొంగ ప్రవేశించినట్లు తెలిసింది. ఆ జ్యువెలరీ షాప్‌లో ఉన్న సుమారు 25 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. చోరీ చేయ‌డానికి ముందు దొంగ‌లు సీసీటీవీ కెమెరాల‌ను డిస్‌క‌నెక్ట్ చేశారు. లాక‌ర్లు ఉన్న స్ట్రాంగ్‌రూమ్‌కు రంధ్రం చేసి దొంగ‌లు చోరీకి పాల్పడ్డారు.ఆదివారం అర్థరాత్రి చోరీ జరిగినట్లు భావిస్తున్న పోలీసులు, సీసీ కెమెరాలను పరిశీలించి ఆధారాల కోసం వెతుకుతున్నారు.

నాలుగు అంతస్తులు ఉన్న ఆ భవనంలోకి పై అంతస్తు నుంచి దొంగలు చొరబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న స్ట్రాంగ్‌రూమ్‌ను దొంగలు పగలగొట్టారు. స్ట్రాంగ్‌రూమ్‌లోకి ప్రవేశించేందుకు దొంగలు గోడకు భారీ రంధ్రాన్ని డ్రిల్ చేశారు. లాకర్‌లో ఉన్న ఆభరణాలతో పాటు షోరూమ్‌ డిస్‌ప్లేలో ఉన్న బంగారాన్ని కూడా ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న నిజాముద్దీన్‌ పోలీస్‌స్టేషన్‌ ఘటనా స్థలానికి చేరుకుని ఆదివారం అర్థరాత్రి జువెలరీ షోరూంలో దొంగలు చొరబడి ఉంటారని అనుమానిస్తున్నారు. జ్యువెలరీ షోరూంలోని ఫుటేజీని, సమీపంలో అమర్చిన సీసీ కెమెరాలను స్కాన్ చేయడమే కాకుండా, సమీపంలోని వ్యక్తులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. దొంగతనం కేసు నమోదు చేసి, దర్యాప్తులో నిమగ్నమైన ఢిల్లీ పోలీసు బృందం సోమవారం నగల షోరూమ్‌కు సెలవు అని చెప్పారు. మంగళవారం ఉదయం షోరూమ్‌ను ప్రారంభించిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

షోరూం యజమాని సంజీవ్ జైన్ మాట్లాడుతూ.. ఆదివారం షాపు మూసేశామని, సోమవారం సెలవు కావడంతో మంగళవారం ఉదయం షాపు తెరిచి చూడగా షాపు మొత్తం దుమ్ము, స్ట్రాంగ్ రూం గోడకు రంధ్రం పడి ఉందని తెలిపారు. లోపలికి వెళ్లి చూడగా దొంగలు ఉన్నదంతా దోచుకెళ్లారు. దాదాపు రూ.20-25 కోట్ల విలువైన ఆభరణాలను దుకాణంలో ఉంచారు. దొంగలు దుకాణం పైకప్పు నుంచి లోపలికి ప్రవేశించారు. షోరూం పైకప్పు, గోడ పగులగొట్టి లోపలికి చొరబడిన దొంగలు సులువుగా చోరీకి పాల్పడ్డారని జైన్ తెలిపారు. సీసీటీవీ సహా అన్నీ ధ్వంసమయ్యాయి. పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. పోలీసులు జ్యువెలరీ షోరూమ్ సిబ్బందిని కూడా విచారించారు, త్వరలో ఆధారాలు దొరుకుతాయని పేర్కొన్నారు