Leading News Portal in Telugu

Asian Games 2023: చరిత్ర సృష్టించిన భారత్‌.. 41 ఏళ్ల తర్వాత ఆ విభాగంలో స్వర్ణం


Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌ మరో బంగారు పతకాన్ని సాధించింది. ఈక్వస్ట్రియన్‌(గుర్రపు స్వారీ) విభాగంలో బంగారు పతకం సాధించిన భారత్‌.. 41 ఏళ్ల తర్వాత ఈ విభాగంలో స్వర్ణం సాధించడం గమనార్హం. 1982 తర్వాత ఆసియా క్రీడల్లో భారత్ తొలిసారిగా ఈక్వెస్ట్రియన్‌లో బంగారు పతకం సాధించింది. టీమ్ డ్రస్సేజ్ ఈవెంట్‌లో భారత జట్టు మొత్తం 209.205 స్కోరుతో అగ్రస్థానంలో ఉండగా, చైనా 204.882తో రజతంతో ముగించగా, హాంకాంగ్ 204.852తో 3వ స్థానంలో నిలిచింది. సుదీప్తి హజెలా (చిన్స్కీ – గుర్రం పేరు), హృదయ్ విపుల్ ఛేడా (కెమ్‌క్స్‌ప్రో ఎమరాల్డ్), అనుష్ అగర్వాలా (ఎట్రో), దివ్యకృతి సింగ్ (అడ్రినాలిన్ ఫిర్‌ఫోడ్)లతో కూడిన భారత బృందం ఈక్వెస్ట్రియన్‌లో డ్రస్సేజ్ ఈవెంట్‌లో భారతదేశానికి మొదటి బంగారు పతకాన్ని సాధించి చరిత్రను లిఖించింది. డ్రెస్సేజ్ టీమ్ ఈవెంట్‌లో జట్టు మొత్తం స్కోర్ కోసం టాప్ 3 పెర్ఫార్మర్స్ స్కోర్ మాత్రమే పరిగణించబడుతుంది. అనూష్ అగర్వాలా స్కోరు 71.088 సంచలన ప్రదర్శన చేసి చివరిగా వెళ్లి భారత్ పతక ఆశలను పెంచాడు. ఆసియా క్రీడల్లో ఈక్వెస్ట్రియన్‌లో భారత్‌కు ఇది నాల్గవ స్వర్ణం కాగా.. ఈవెంట్‌ వారీగా వారి 13వ పతకం. ఈక్వెస్ట్రియన్‌లో భారతదేశం సాధించిన 3 బంగారు పతకాలు 1982 ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడలలో వచ్చాయి.

ఇదిలా ఉండగా.. దీనికి ముందు సెయిలింగ్‌లో భారత్‌కు ఇవాళే(సెప్టెంబర్‌ 26) మూడు పతకాలు లభించాయి. భారత సెయిలర్లు నేహా ఠాకూర్‌ రజతం సాధించగా… ఎబాద్‌ అలీ, విష్ణు శరవణన్‌ కాంస్య పతకాలు సాధించారు. ఆసియా క్రీడల్లో మూడో రోజు మధ్యాహ్నం సమయానికి భారత పతకాల సంఖ్య 14కు (3 స్వర్ణాలు, 4 రజతాలు, 7 కాంస్య పతకాలు) చేరింది. పతకాల పట్టికలో చైనా 78 పతకాలతో టాప్‌లో కొనసాగుతుండగా.. భారత్‌ ప్రస్తుతం ఆరో స్థానంలో ఉంది.

https://twitter.com/WeAreTeamIndia?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1706614788686590225%7Ctwgr%5Ec5166cb526eabe1624db6a563f87157633da03e7%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.indiatoday.in%2Fsports%2Fasian-games-2023%2Fstory%2Fasian-games-2023-india-win-gold-medal-in-equestrian-after-41-years-script-history-in-dressage-team-2440712-2023-09-26