Leading News Portal in Telugu

Bank Holidays : అక్టోబర్ లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా?


ప్రతి నెల బ్యాంకులకు సెలవులు ఉన్నట్లే అక్టోబర్ నెలలో కూడా సెలవులు ఉన్నాయి.. వాటికి సంబందించిన లిస్ట్ ను ఆర్బీఐ విడుదల చేసింది.. ఇందులో వీకెండ్స్ కూడా ఉన్నాయి.. ఈ సెలవులు ఒక్కో ప్రాంతంలో మారుతాయి.. వచ్చే నెలలో మొత్తం 15 రోజులకు పైగా సెలవులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా.. దసరా నేపథ్యంలో అక్టోబర్​ చివరి వారంలో ఎక్కువ బ్యాంకు సెలవులు ఉండటం కారణంగా.. బ్యాంక్​ సేవలు నిలిచిపోనున్నాయి. బ్యాంకింగ్​ పనుల కోసం వెళ్లేవారు.. సెలవుల లిస్ట్​ను కచ్చితంగా తెలుసుకోవాలి.. లేదంటే టైం వేస్ట్ అవుతుంది..

వచ్చే నెలలో సెలవుల లిస్ట్ ఇదే..

2023 అక్టోబర్​ 2- సోమవారం, మహాత్మా గాంధీ జయంతి.

2023 అక్టోబర్​ 14- రెండో శనివారం. దేశంలోని అన్ని బ్యాంక్​లకు సెలవు.

2023 అక్టోబర్​ 15- ఆదివారం. అన్ని బ్యాంక్​లకు సెలవు.

2023 అక్టోబర్​ 18- బుధవారం, కాతి బిహు. అసోంలోని బ్యాంక్​లకు సెలవు.

2023 అక్టోబర్​ 19- గురువారం, సంవత్సరి పండుగ. గుజరాత్​లోని బ్యాంక్​లకు సెలవు..

2023 అక్టోబర్​ 21- శనివారం, దుర్గాపూజ.

2023 అక్టోబర్​ 22- ఆదివారం.

2023 అక్టోబర్​ 23- సోమవారం, మహా నవమి.

2023 అక్టోబర్​ 24- మంగళవారం దసరా.

2023 అక్టోబర్​ 25- దుర్గా పూజ

2023 అక్టోబర్​ 26- యాక్సెషన్​ డే. జమ్ముకశ్మీర్​లోని బ్యాంక్​లకు సెలవు.

2023 అక్టోబర్​ 27- దసై, దుర్గా పూజ.

2023 అక్టోబర్​ 28- నాలుగో శనివారం, లక్ష్మీ పూజ.

2023 అక్టోబర్​ 29- ఆదివారం.

2023 అక్టోబర్​ 31- మంగళవారం, సర్దార్​ వల్లభాయ్​ పటేల్​ జయంతి..

ఈ లిస్ట్ ప్రకారం చూస్తే.. వచ్చే నెలలో సగానికి సగం సెలవులే ఉన్నాయి.. బ్యాంక్‌ సేవలు మూసి వేసినప్పటికీ, ఆన్‌లైన్ సేవలు అందుబాటులోనే ఉంటాయి. మీరు మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏటీఎం సేవలను పూర్తిగా వినియోగించుకోవచ్చు. ఎందుకంటే.. బ్యాంక్‌ హాలీడేస్‌ తో డిజిటల్ సేవలపై ఎలాంటి ప్రభావం ఉండదు.. ఇంకేదైనా ముఖ్యమైన పని ఉంటే ముందే చూసుకోవడం మంచిది..