Leading News Portal in Telugu

Minister KTR: నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన


Minister KTR: నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేయనున్నారు. అనంతరం కేజీ టూ పీజీ క్యాంపస్ ఎదురుగ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ ప్రసంగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు గంభీరావుపేట లింగన్నపేట రోడ్డులో మానేరు వాగు పై హైలెవెల్ బ్రిడ్జీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు లింగన్నపేటలో కోల్లమద్దిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభించనున్నారు. సాయంత్రం 5 గంటలకు మన ఊరు-మన బడిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభించనున్నారు. కొత్తపల్లిలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు కోల్లమద్దిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభిస్తారు. సాయంత్రం 6 గంటలకు నర్మాలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభించనున్నారు.

Read also: Jagapathi Babu: అవంటే చాలా భయమంటున్న స్టార్ విలన్

జగిత్యాలలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ, పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు జరగనున్న నేపథ్యంలో జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్‌కుమార్‌తో పాటు జిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ భాషా, అదనపు కలెక్టర్‌ బీఎస్‌. మంగళవారం డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పనులను లత పరిశీలించారు. వారి వెంట వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
Chandrababu Arrest: చంద్రబాబు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ