టాలివుడ్ హీరో మాస్ మహారాజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మూవీ టైగర్ నాగేశ్వరరావు. కొంతకాలంగా మాస్ రాజా నుంచి సాలిడ్ హిట్ పడటంలేదని నిరాశలో ఉన్నారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు టైగర్ నాగేశ్వరావు తో ఫ్యాన్స్ కు అదిరిపోయే కిక్ ఇవ్వనున్నారు రవితేజ.. ఈ సినిమాలో రవితేజ ఫుల్ మాస్ లుక్ లో కనిపించునున్నారు.. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, సాంగ్ ప్రేక్షకులోను మెప్పించాయి. స్టువర్టుపురాని చెందిన ఓ గజదొంగ జీవితకథ ఆధారంగా ఈ చిత్రాన్ని ను తెరకెక్కించారు.
ఈ మూవీ కోసం రవితేజ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ లో హీరోయిన్ గా కృతి సనన్ సిస్టర్ నుపూర్ సనన్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఇక హీరోయిన్, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది.. ఇక ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్ని సినిమా పై అంచనాలను పెంచగా.. ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేశారు..త్వరలోనే ట్రైలర్ ను రిలీజే చేయనున్నారు. టైగర్ నాగేశ్వరావు ట్రైలర్ ను అక్టోబర్ 3న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. దాంతో ఈ మూవీ ట్రైలర్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్. టైలర్ అనౌన్స్ మెంట్ తో ఓ పోస్టర్ ను రిలీజే చేశారు. ఇట్స్ టైం టూ రోర్ అంటూ రవితేజ మాస్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు..
ఊరమాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ ను అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన టీజర్ పై అంచనాలను పెంచేసింది. టైగర్ నాగేశ్వరావు కు వంశీకృష్ణనాయుడు దర్శకత్వం వహిస్తుండగా అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. 1970 లో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వంశీకృష్ణనాయుడు. ఈ సినిమాపై గట్టి నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. మరి ఈ మూవీ ఎలాంటి హిట్ టాక్ అందుకుంటుందో చూడాలి…
It’s time to roar!#TigerNageswaraRao
Trailer on OCTOBER 3rd 🔥 pic.twitter.com/hSFe65Jich— Ravi Teja (@RaviTeja_offl) September 26, 2023