ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డిసెంబర్ నెల అనగానే ట్రేడ్ వర్గాలు కూడా నీరస పడిపోతాయి. అంత వీక్ సీజన్ డిసెంబర్ నెల అంటే… ఈసారి మాత్రం డిసెంబర్ మాత్రం ముందులా ఉండేలా లేదు. భారతీయ సినిమా చూసిన బిగ్గెస్ట్ సీజన్ గా 2023 డిసెంబర్ నిలవనుంది. ప్రస్తుతం ఆడియన్స్ నుంచి ట్రేడ్, ఇండస్ట్రీ వర్గాల వరకూ ప్రతి ఒక్కరి ఆలోచిస్తున్న ఒకే ఒక్క విషయం ప్రభాస్, షారుఖ్ ఖాన్ క్లాష్ లో ఎవరు గెలుస్తారు? సలార్, డుంకి సినిమాల్లో ఏ సినిమా హిట్ అవుతుంది… ఇవే ఆలోచనలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. రాజ్ కుమార్ హిరానీ బ్రాండ్ ఇమేజ్, షారుఖ్ ఖాన్ ఉన్న గోల్డెన్ ఫేజ్ లు డుంకి సినిమాని నార్త్ అండ్ ఓవర్సీస్ బెల్ట్ లో హాట్ ఫెవరేట్ గా నిలబెడుతుండగా… ప్రభాస్ మాస్ ఇమేజ్, ప్రశాంత్ నీల్ సెన్సేషనల్ టేకింగ్ సలార్ సినిమా సౌత్ లో స్ట్రాంగ్ గా నిలబెడుతున్నాయి. ఏ సినిమా బలం ఆ సినిమాకి ఉన్నా కూడా అసలు ప్రభాస్, షారుఖ్ లాంటి హీరోలు క్లాష్ కి దిగకుండా ఉండాలి. థియేటర్స్ దగ్గర నుంచి ప్రతి విషయంలో ఎదో ఒక సినిమాకి నష్టం జరిగే అవకాశం ఉంది. షారుఖ్-రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ కి కాదని నార్త్ లో ప్రభాస్ కి థియేటర్స్ ఇవ్వరు… ప్రభాస్-ప్రశాంత్ నీల్ ని కాదని సౌత్ డుంకి సినిమాకి థియేటర్స్ ఇవ్వరు. సో ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే రెండు సినిమాలకీ నష్టమే.
లాభ నష్టాలు కాసేపు పక్కన పెడితే… సలార్ మేకర్స్ నుంచి ఇంకా అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ ఒకవేళ సలార్, డుంకి ఒకే రోజు రిలీజ్ అయితే మాత్రం… రెండు సినిమాలు కలిపి ఈజీగా 2500 కోట్లు కలెక్ట్ చేస్తాయి. ఇది బేస్ ఫిగర్ మాత్రమే., హిట్ టాక్ వచ్చి సెన్సేషన్ క్రియేట్ అయితే అది 3000 కోట్ల వరకూ వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ రెండు సినిమాలు చాలవన్నట్లు అనిమల్, కెప్టెన్ మిల్లర్ లాంటి సినిమాలు కూడా పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ అవుతున్నవే. ఈ రెండు సినిమాలు కలిపి 500 కోట్లని రాబట్టే అవకాశం ఉంది. సందీప్ రెడ్డి వంగ మార్క్ వర్కౌట్ అయితే అనిమల్ సినిమానే 500 కోట్లు రాబట్టగలదు, ఇక కెప్టెన్ మిల్లర్ ఎక్స్ట్రా అనే చెప్పాలి. ఓవరాల్ గా కేవలం డిసెంబర్ నెలలోనే ఇండియన్ సినిమా 3000-3500 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టడం గ్యారెంటీ. ఇది ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ అని చెప్పాలి.