Leading News Portal in Telugu

Unstoppable 3: బాలయ్య అన్ స్టాపబుల్ 3 కి ముహూర్తం ఫిక్స్.. ఫస్ట్ గెస్ట్ ఎవరంటే?


ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో సంచలనం సృష్టించిన టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన టాక్ షోలలో బాలయ్య హోస్ట్ చేసిన అన్‌స్టాపబుల్ షో కూడా ఒకటి. ఈ షో ఇప్పటికే రెండు సీజన్‌లను విజయవంతంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.. ఇక 3 త్వరలో ప్రారంభం కానుంది. సినిమాల్లో భారీ డైలాగులతో, డ్యాన్స్ తో పూనకాలు తెప్పించిన బాలకృష్ణ మొదటిసారి టాక్ షో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.. బాలయ్య ఇలా కూడా చేస్తాడా అని నందమూరి అభిమానులు ఆశ్చర్యపోయారు.. సినిమాల్లో కంటే ఈ టాక్ షోలో ఆయన పంచులు, కామెడీ టైమింగ్ ఎక్కువగా చూపించారు.. అదే ఆ షోకు హైలెట్ గా నిలిచింది..

అందుకే ప్రముఖ ఆహాలో ప్రసారమై మొదటి రెండు సీజన్లు సంచలన విజయాన్ని అందుకున్నాయి.. ఇక రెండో సీజన్లో మూవీస్ మాత్రమే కాదు..పొలిటికల్ హీట్ ను కూడా పెంచారు బాలయ్య .. గత సీజన్ 2 కు టీడీపీ అధ్యక్షులు మాజీ సీఏం నారా చంద్రబాబు నాయుడు, లోకేష్‌లతో మొదలై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ముగిసింది. మొదటి ఎపిసోడ్ తీవ్ర వివాదాన్ని ఎదుర్కొంది.. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ షోకు ప్రభాస్ కూడా రావడంతో రేటింగ్ భారీగా పెరిగింది..ఈ షోకు దక్కని ఆల్ టైమ్ వ్యూస్ వచ్చాయి.. జనాల్లో మంచి క్రేజ్ ను అందుకుంది..

ఇదిలా ఉండగా.. త్వరలోనే మూడో సీజన్ ను ప్రారంభించాలని బాలయ్య రెడీ అవుతున్నాడట.. ప్రస్తుతం ఆయన రాజకీయాలు, సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సీజన్ 3ని ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ సీజన్‌లో సినీ ప్రముఖుల కంటే రాజకీయ ప్రముఖులనే గెస్ట్‌లుగా తీసుకురానున్నారు. తెలంగాణ మంత్రి కెటిఆర్, మెగాస్టార్ చిరంజీవి, పురందేశ్వరి వంటి ప్రముఖ నాయకులను పిలిపించే ఆలోచనలో ఉన్నట్లు టాక్ .. ఇదే నిజమైతే బాలయ్యతో చిరంజీవి, కేటీఆర్ ఒకే వేదికపై కనిపిస్తే రాజకీయంగానూ, సినీ పరంగానూ సంచలనం అవుతుంది. అలాగే మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి.. ఇటీవలే అల్లు అరవింద్‌ అన్ స్టాపబుల్ సీజన్ 3కి మొదటి గెస్ట్ గా తీసుకురావడంలో చొరవ చూపినట్లు తెలుస్తోంది వార్తలు నడుస్తున్నాయి.. చిరంజీవి, బాలయ్య ను ఒకే ఫ్రెమ్ లో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.. మరి ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.. ప్రస్తుతం బాలయ్య బాబు అనిల్ రావీపూడి సినిమాలో నటిస్తున్నాడు.. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకులకు ముందుకు రానుంది..