Leading News Portal in Telugu

Itel Power P55 5G Launch: చౌకైన 5G స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది.. రూ. 9699కే ఐటెల్‌ పీ55 పవర్ ఫోన్!


Itel Launches Itel P55 Power 5G and Itel S23+ in India: చైనీస్ మొబైల్‌ తయారీ సంస్థ ‘ఐటెల్‌’ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లకు ప్రసిద్ధి అని తెలిసిందే. తక్కువ ధరకే మంచి ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొస్తూ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే అతి తక్కువ ధరకే అదిరే ఫీచర్లతో రెండు స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ లాంఛ్ చేసింది. ఐటెల్ పీ55 పవర్ 5జీ, ఐటెల్ ఎస్ 23 ప్లస్ ఫోన్‌లను ఐటెల్‌ తీసుకొచ్చింది. పీ55 పవర్ 5జీ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్ మరియు ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది.

Itel P55 Power 5G Price:
ఐటెల్‌ పీ55 పవర్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ 4GB రామ్ మరియు 64GB స్టోరేజ్ వేరియెంట్ ధర రూ. 9,699గా కంపెనీ నిర్ణయించింది. 6GB రామ్, 128GB స్టోరేజ్ వేరియెంట్ ధర రూ. 9,999గా ఉంది. ఈ ఫోన్ అక్టోబర్ 4 నుండి ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై 2 సంవత్సరాల వారంటీ ఇవ్వబడుతుంది. బ్యాంక్, ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్స్ కూడా దీనిపై ఉండే అవకాశాలు ఉన్నాయి.

Itel P55 Power 5G Features:
ఐటెల్‌ పీ55 పవర్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ 90 Hz రిఫ్రెష్ రేట్ ప్యానెల్ మరియు 1600 x 720 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.6-ఇంచెస్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6080 SoCతో పాటు ఆండ్రాయిడ్ 13-ఆధారిత ఐటెల్‌ ఓఎస్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5,000 mAh బ్యాటరీ, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. ఏఐ సెన్సార్‌తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇంత తక్కువలో మంచి ఫీచర్స్ ఉన్న 5జీ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో లేదనే చెప్పాలి.

ఐటెల్ ఎస్23 ప్లస్ ఫీచర్స్ (Itel S23+ Price and Specs):
# 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్‌ త్రీడీ కర్వ్‌డ్‌ డిస్‌ప్లే
# గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్
# ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్
# యూనిసోక్ టీ606 చిప్ సెట్ (5జీ సపోర్ట్ కాదు)
# 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా
# 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
# 5000 ఎంఏహెచ్ బ్యాటరీ (18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
# రూ. 15 వేల సెగ్మెంట్లో త్రీడీ కర్వ్‌డ్‌ డిస్‌ప్లేతో వచ్చిన తొలి స్మార్ట్‌ఫోన్‌ ఇదే కావడం గమనార్హం. రూ. 13,999కే ఇన్ని అద్భుత ఫీచర్లున్న ఫోన్ బహుశా ఇదే మొదటిది కావచ్చు. అయితే ఇది 5జీ ఫోన్ కాకపోవడం ఒక్కటే మైనస్.