సీజేఐ బెంచ్ కు చంద్రబాబు క్వాష్ పిటిషన్.. అక్టోబర్ 3న విచారణ | chandrababu quash pitition before cji bench on october 3rd| skill| case| judge| not| before
posted on Sep 27, 2023 5:15PM
ఏపీ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు తన క్వాష్ పిటిషన్ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన ఎస్ఎల్పీపై ఈ రోజు సుప్రీంలో విచారణకు వచ్చినప్పటికీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీఎన్ భట్టి నాట్ బిఫోర్ అనడంతో అనివార్యంగా విచారణ వాయిదా పడింది. మరో బెంచ్ కేసు విచారించాల్సి ఉందంటూ సుప్రీం కోర్టు ఏకంగా వారం పాటు విచారణ వాయిదా వేసింది.
ఈ దశలో చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూద్రా మధ్యంతర రిలీప్ కోసం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ బెంచ్ ను ఆశ్రయించారు. పరిగణనలోనికి తీసుకున్న సుప్రీం ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ చంద్రబాబు కేసును నెక్ట్స్ వర్కింగ్ డే అయిన మంగళవారం (సెప్టెంబర్ 3)విచారణ చేపడతామని అన్నారు. అంటే చంద్రబాబు క్వాష్ పిటిషన్ మంగళవారం సీజేఐ బెంచ్ ముందుకు విచారణకు వస్తుంది. అయితే కింది కోర్టులో జరుగుతున్న ప్రొసీడింగ్స్ పై ఎటువంటి నియంత్రణా విధింజాలమని సీజేఐ పేర్కొన్నారు. కాగా చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూధ్రా 17ఏ అనేది కేసు మూలాల నుంచి చర్చించాల్సిన అంశమని.. ఎఫ్ఐఆర్ లో పేరు లేని చంద్రబాబును కస్టడీలో పెట్టకూడనటువంటి కేసు ఇదని వాదించారు.
అలాగే తాము బెయిల్ కోరుకోవడం లేదని అది మెరిట్ ప్రకారం వస్తుందన్నారు. జడ్ ప్లస్ క్యాటగిరీ, ఎన్‍ఎస్‍జీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని ట్రీట్ చేసే విధానం ఇదా అని ప్రశ్నించారు. అలాగే పూర్తిగా వ్యక్తి స్వేచ్ఛను సంబంధించిన విషయమన్నారు. యశ్వంత్ సిన్షా కేసులో వ్యక్తి స్వేచ్ఛపై అన్ని విషయాలు పొందుపరిచారని వివరించారు. ఈ దశలో సీజేఐ చంద్రచూడ్ చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను వచ్చే నెల మూడో తేదీన విచారణకు లిస్ట్ చేస్తామని తెలిపారు. దీంతో కేసు మూడో తేదీకి వాయిదా పడినట్లయింది. అంతకు ముందు బెంచ్‌లో ఉన్న జస్టిస్ సరస వెంకటనారాయణ భట్టి ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో (2000-2003) పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పని చేశారు.
దాంతో ఈ కేసులో కేసులో విచారణకు ఆయన నిరాకరించారు. ఇటీవలే హైకోర్టులో చంద్రబాబుకు వ్యతిేకంగా ప్రభుత్వం తరపున వాదించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి .. అభ్యంతరం ఉంటే వైదొలుగుతానని ఇరు పక్షాల లాయర్లకు చెప్పారు. కానీ ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. దీంతో విచారణ జరిపిన జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా చంద్రబాబు ఏసీబీ వేసిన చంద్రబాబు కస్టడీ పిటిషన్, చంద్రబాబు బెయిల్ పిటిషన్ లపై విజయవాడ ఏసీబీ కోర్టులో నేడు విచారణ జరిగింది. రెండింటినీ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వచ్చే నెల5వ తేదీకి వాయిదా వేసింది.