Leading News Portal in Telugu

North Korea: బతికిపోయాడు.. అమెరికా సైనికుడిని బహిష్కరించిన నార్త్ కొరియా..


North Korea: ప్రపంచం అంతా ఒకలా ఉంటే నార్త్ కొరియా మాత్రం మరోకలా ఉంటుంది. బయటి ప్రపంచంతో అక్కడి ప్రజలకు ఎలాంటి సంబంధాలు ఉండవు. ఫాల్స్ ప్రాపగండాతో ఆ దేశం నడుస్తుంది. అక్కడి కిమ్ జోంగ్ ఉన్ చెప్పిందే చట్టం, చేసిందే న్యాయం. కాదని ఎదురు తిరిగారో కుక్క చావే. అలాంటి దేశంలోకి వేరే దేశం వాళ్లు వెళ్లడం అంటే సింహం నోట్లో తలపెట్టినట్లే. ఇక అమెరికా పౌరుడైతే చావే గతి.

కానీ ఒకరు మాత్రం బతికి బట్టకట్టాడు. ట్రావిస్ కింగ్ అనే అమెరికన్ వ్యక్తి అక్రమంగా నార్త్ కొరియాలోకి ప్రవేశించి పట్టుబడ్డాడు. అమెరికన్ సైన్యంలో పనిచేసిన అతను పట్టుబడటంతో ఇక వెనక్కి రాకుండా అక్కడే జైలులో మగ్గిపోతారని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా నార్త్ కొరియా ఇతడిని దేశం నుంచి బహిష్కరించాలని నిర్ణయించింది.

జూలై నెలలో తమ సరిహద్దు దాటి, అక్రమంగా ప్రవేశించాడని నార్త్ కొరియా పేర్కొంది.అమెరికా సైన్యంలో అమానవీయ ప్రవర్తన, జాతి వివక్షపై ట్రావిస్ కింగ్ చెడు అభిప్రాయం కలిగి ఉన్నాడని నివేదిక పేర్కొంది. దక్షిణ కొరియాలోని డిమిలిటరైజుడ్ జోన్ లో పర్యటిస్తున్న సందర్భంలో హఠాత్తుగా ట్రావిస్ కింగ్ నార్త్ కొరియా భూభాగంలోకి వెళ్లాడు. ట్రావిస్ కింగ్ ఉత్తర కొరియాలో ఆశ్రయం పొందాలని అనుకున్నాడని గతంలో ఆ దేశం పేర్కొంది.