AP High Court: క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్‌పై విచారణ జరిగిపన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత హైకోర్టు, ఏసీబీ కోర్టుల న్యాయమూర్తులపై సోషల్ మీడియా వేదికగా దూషణలు పెరిగాయి.. ఈ వ్యవహారంలో ట్విట్టర్, ఫేస్‌బుక్, టీడీపీ నేత బుద్దా వెంకన్న సహా 28 మందిని ప్రతివాదులుగా చేర్చింది ఏపీ ప్రభుత్వం. ఈ వ్యవహారం అడ్వొకేట్ జనరల్ శ్రీరాం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి.. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్.. తెలుగుదేశం నాయకులు, సానుభూతి పరులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది హైకోర్టు.. ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులు, ఏసీబీ కోర్టు జడ్జి ఫ్యామిలీలు టార్గెట్‌గా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారని ఏజీ వాదనలు వినిపించారు.. టీడీపీ నేతలు బుచ్చయ్య చౌదరి, బుద్ధా వెంకన్న సహా 26 మందికి నోటీసులు ఇవ్వాలని.. ట్రోల్ చేసిన సోషల్ మీడియా ఖాతాలకు నోటీసులు ఇవ్వాలని ఏపీ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు.
బుద్ధా వెంకన్న, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎస్. రామకృష్ణ, రామకృష్ణ గోనె, మువ్వా తారక్ కృష్ణ యాదవ్, రవికుమార్ ముదిరాజు, రుమాల రమేష్, ఎల్లా రావు, కళ్యాణితో పాటు.. @NCHIRAN17457886, In Jesus New Life @ NewIN34229, @TrueAPDeveloper, Mosapu, Jail Jj, The Ark @ArkTheAce, @EdukondaluMupp2 , @Royanenenu, @Wish_cap, @Cdattu, @Bean9989, Chary Veda, Paramasivaiah Gsanju Chandu, SriKishore Kumar ఖాతాలకు, గూగుల్ ఇండియా, ట్విట్టర్ ఇండియా, ఫేస్‌బుక్ ఇండియాకు కూడా నోటీసులు జారీ చేయనున్నారు.