టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.. బుధవారం విఐపి దర్శనం సమయాల్లో ఈ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు.. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో గంభీర్ పాల్గొన్నాడు.టీటీడీ అధికారులు గంభీర్ దంపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలను అందించారు..
శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు గౌతీని సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
ఈ సందర్బంగా గంభీర్ మాట్లాడుతూ..వన్డే ప్రపంచకప్-2023 టైటిల్‌ను సొంతం చేసుకునేందుకు భారత జట్టుకు మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. 140 కోట్ల మంది భారతీయుల ప్రార్థనలతో టీమిండియా కచ్చితంగా వరల్డ్ కప్ గెలుస్తుందని గంభీర్ ఆశాభావం వ్యక్తం చేసారు. ఇకపోతే భారత్ వేదికగా వచ్చే నెల ఐదు నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఇక భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో పోటి పడనుంది..