Leading News Portal in Telugu

Prabhas: ప్రభాస్ నీ రాక కోసం ‘సలార్’ ఎదురుచూస్తుంది…


ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ఫ్యాన్స్‌ను తెగ ఊరిస్తోంది. ఎందుకంటే… ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ చేసిన మూడు సినిమాలు ఊరమాస్‌ సినిమాలే. కన్నడలో వచ్చిన ఉగ్రం, పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చిన కెజియఫ్ చాప్టర్ వన్, చాప్టర్ 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మాసివ్ హిట్ సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా కెజియఫ్ సంచలనంగా నిలిచింది. మూడో సినిమాతోనే వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరి… రాజమౌళి సరసన చేరిపోయాడు ప్రశాంత్ నీల్. అలాంటి దర్శకుడికి పాన్ ఇండియా కటౌట్ ప్రభాస్ లాంటి హీరో దొరికితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే సలార్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. కానీ ప్రస్తుతం సలార్ సినిమా మాత్రం ప్రభాస్ కోసం వెయిట్ చేస్తోంది. ఈ మధ్య సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి… మోకాలి ఆపరేషన్ కోసం విదేశాలకి వెళ్లాడు ప్రభాస్.

ఇప్పటికే మోకాలికి సంబంధించిన సర్జరీ అయిపోయింది. ప్రస్తుతం డార్లింగ్ రెస్ట్‌ మోడ్‌లో ఉన్నాడు. పూర్తిగా కోలుకున్న తర్వాత నవంబర్‌లో ఇండియాకు తిరిగి రానున్నాడని తెలుస్తోంది. తిరిగొచ్చిన తర్వాత కల్కి 2898 ఏడీ , మారుతి సినిమా షూటింగ్‌లో జాయిన్ అవనున్నాడట. అలాగే సలార్ ప్యాచ్ వర్క్‌ కూడా ఉందని తెలుస్తోంది. ఓ స్పెషల్ సాంగ్ షూట్ కూడా ఉందని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే… ప్రభాస్ తిరిగి రాగానే ఫస్ట్ సలార్ వర్క్ కంప్లీట్ చేయనున్నాడు. అందుకే సలార్‌ను డిసెంబర్‌ 22న సలార్ రిలీజ్ చేస్తున్నారని తెలుస్తోంది. కాబట్టి నవంబర్‌లో డార్లింగ్ ఇండియాలో అడుగు పెడితే.. షూటింగ్‌తో పాటు సలార్ ప్రమోషన్స్‌లో పాల్గొననున్నాడు. మరి ప్రభాస్ ఎప్పుడు హైదరాబాద్‌లో ల్యాండ్ అవుతాడో చూడాలి.