ములుగు జిల్లాలో మంత్రులు హరీష్ రావు, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాలతో పాటు.. ములుగు మండలం రాంచంద్రపురం గ్రామంలోని 33/11 కేవి సబ్ స్టేషన్కి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం ములుగు ఏరియా ఆసుపత్రిలో SNCU వార్డు ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ములుగు జిల్లాలో 183కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేసామని తెలిపారు. రాష్ట్రంలో వైద్య విప్లవం సృష్టించింది సీఎం కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. కేసీఆర్ వల్లే ములుగు జిల్లాగా ఏర్పడిందని.. కొత్త మెడికల్ కళాశాల సాధ్యమైందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ లేకుంటే.. ములుగు జిల్లా వచ్చేదా? మెడికల్ కళాశాల వచ్చేదా అని అన్నారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 12 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసామని మంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి పథకం అమలు చేయడానికి ములుగు జిల్లానే స్ఫూర్తి అని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. బిడ్డకు పెళ్లి చెయ్యలేక ఇబ్బంది పడుతున్న తండ్రికి నాడు కేసీఆర్ అండగా నిలిచారని.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కళ్యాణలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
కొత్తగూడ గంగారం పరిధిలో మండల phc కోసం ఏర్పాటు చేస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. ములుగు జిల్లాలో పోడు భూముల వల్ల నష్టపోయిన గిరిజన ఇతరులకు కూడా హక్కు పట్టాలను మంజూరు మంజూరు చేసే విధంగా కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా.. గోదావరి జలాలను ములుగు నియోజకవర్గ ప్రజలకు సాగునీరు, మంచినీటిని కూడా అందిస్తామన్నారు. ములుగు నియోజకవర్గం మరో 2000 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేయడం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఏటునాగారం రెవెన్యూ డివిజన్ డిమాండ్ ను మంత్రి దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి పేర్కొన్నారు.