
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. అంతకుముందు స్పెషల్ ఫ్లైట్ లో గన్నవరం వచ్చిన అదానీ.. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లి సీఎం నివాసానికి చేరుకున్నారు. అనంతరం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో గౌతమ్ అదానీ సమావేశమయ్యారు.
Read Also: Ujjain Case: ఉజ్జయిని మైనర్ రేప్ కేసు.. తప్పించుకునేందుకు నిందితుడి యత్నం..
దాదాపు గంటన్నర నుంచి ముఖ్యమంత్రి జగన్ తో గౌతమ్ అదానీ సమావేశం కొనసాగుతుంది. విశాఖపట్నంలో డేటా సెంటర్, గంగవరం, కృష్ణపట్నం పోర్టు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు విశాఖపట్నంలో డేటా సెంటర్ ను అదానీ సంస్థ ఏర్పాటు చేస్తుంది. మొన్న మే నెలలో అదానీ డేటా సెంటర్ కు సీఎం జగన్ శంకుస్థాపన కూడా చేశారు. దాని కోసం ప్రభుత్వం 190 ఎకరాల భూమిని కేటాయించింది.
Read Also: Naga Babu: పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి.
దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ను అదానీ గ్రూప్ విశాఖలో నిర్మిస్తుంది. అంతేకాకుండా.. రాష్ట్రంలో అదానీ గ్రూప్ భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ప్రస్తుతానికి అదానీ చేతిలో రాష్ట్రంలోని రెండు అతిపెద్ద పోర్టులు గంగవరం, కృష్ణపట్నం ఉన్నాయి. ఇవి కాకుండా.. 15 వేల మెగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్ ను రాష్ట్రంలో స్థాపిస్తుంది అదానీ గ్రూప్.