Leading News Portal in Telugu

Ts Rains: తెలంగాణాలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు..


తెలంగాణ ప్రజలకు బిగ్ అలెర్ట్.. మరోసారి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.. రాగల ఐదురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని సూచించింది.. ఇప్పటికే గత రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురిస్తున్నాయి.. ఇప్పుడు మరో ఐదు రోజులు అంటే జనాలు భయ బ్రాంతులకు గురవుతున్నారు..

అక్టోబర్ 3 వరకు తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు,మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్‌లోనూ ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు..

అక్కడక్కడ ఉరుములు,మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్‌లోనూ ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెఇపారు. ఇక ఉదయం వేళల్లో పొగమంచు వాతావరణం నెలకొనే అవకాశం ఉందని తెలిపింది.. తెలంగాణలో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతమే నమోదు అయ్యింది. మరోసారి వర్ష సూచన ఉండటంతో రైతులు కాస్త ఊరట పొందే అవకాశం ఉందని తెలుస్తుంది..

అలాగే గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో ఓ మోస్తారుగా వర్షాలు కురుస్తున్నాయి.. ట్యాంక్‌బండ్‌లో గణపతి నిమజ్జనాలు జరుగుతుంటే వర్షం కురిసింది. దాంతో.. భక్తులు కాస్త ఇబ్బందులు పడ్డారు. రోడ్లపైకి ఒక్కసారి నీరు చేరడంతో గందరగోళంగా మారింది. ఇక అధికారులు తగు చర్యలు తీసుకున్న కారణంగా గణనాథులు సాఫీగా ముందుకు సాగాయి.. ఇప్పుడు మరో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు..