Leading News Portal in Telugu

water bottle: 750 ఎంఎల్ వాటర్ బాటిల్ ధర 50 లక్షలు.. ఎందుకంత ఖరీదు?


interesting news: మనిషికి మంచినీళ్ల విలువ కూడా ఇవ్వట్లేదు అని ఒక సామెత ఉంది. అంటే మంచినీళ్లు మనకి ఉచితంగా దొరుకుతాయి. అలా దొరికే వాటికి పెద్ద విలువ ఇవ్వరు. అందుకే ఎవరైనా విలువ ఇవ్వని సందర్భాలలో ఈ సామెతని ఉపయోగిస్తారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ఉచితంగా దొరికే నీళ్ళని వదిలేసి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని మినరల్ వాటర్ మోజులో పడ్డాం మనం. అయితే సాధారణంగా వాటర్ బాటిల్ ధర 20 రూపాయలు ఉంటుంది. ఇక ప్రాంతాన్ని బట్టి అంటే మెట్రోస్టేషన్, రైల్వే స్టేషన్, థియేటర్స్ , మొదలైన చోట్ల కొంచం ఎక్కువ ధరకి అమ్ముతారు. కానీ ఎక్కడైనా ఒక బాటిల్ నీళ్ల ఖరీదు లక్షల్లో ఉంటె కొంటారా ఎవరైనా..? ఏంటి బాటిల్ నీళ్లు లక్షల విలువ చేస్తాయా..? అంత ధర చెల్లించి ఎవరు కొనరు. అనుకుంటున్నారా..? అలా అనుకుంటే పొరపాటే.. అవును ఒక బాటిల్ అది కూడా 750 ml నీళ్ల బాటిల్ ధర అక్షరాలా 50 లక్షలు.

Read also:Body soap: సబ్బు ఖరీదు 2.07 లక్షలా.. ఏముంది ఇందులో అంత ప్రత్యేకత.. ?

అవును మీరు విన్నది నిజమే. నీళ్లకు ఇంత ధర ఏంటి అనుకుంటున్నారా.. నీళ్ళకి కాదండి ఆ నీళ్లను ప్యాక్ చేసే బాటిల్ కే ధర. అక్వాడి క్రిస్టల్లో ట్రిబ్యూటో ఎ మొడిగ్లియాని అనే వాటర్ బాటిల్ ప్రపంచంలోనే ఖరీదైన బాటిల్ గా పేరుగాంచింది. ఎందుకు ఈ బాటిల్ ఇంత ఎక్కువ ధర అంటే ఈ గ్లాస్ బాటిల్ మొత్తం 24 క్యారెట్ బంగారం పోత పోసి ఉంటుంది. అలానే ఈ బంగారం వాటర్ బాటిల్‌కు మ్యాజిక్ టచ్ ఉంటుంది. అలానే దీనికి డిజైన్‌ ప్రముఖ డిజైనర్ ఫెర్నాండో అల్టామిరానో అందించింది. ఆసక్తికరంగా వాటర్ బాటిల్‌ లోని ప్రతి నీటి చుక్కలో 5 గ్రాముల 23 క్యారెట్ల బంగారం ఉంటుంది. ఐపిఎల్ మ్యాచ్‌ సందర్శనార్థం వచ్చిన బిలియనీర్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ స్టేడియంలో ఈ బాటిల్ పట్టుకుని ఉన్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దానితో ఈ బాటిల్ గురించిన వార్త వెలుగు చూసింది.