Leading News Portal in Telugu

Akhil Akkineni: అయ్యగారు నెక్స్ట్ ఏంటి?


ఏజెంట్ సినిమా కోసం అక్కినేని అఖిల్ చేయాల్సిందంతా చేసాడు… సినిమాలోనే కాదు ప్రమోషన్స్‌లోనూ అఖిల్ స్టంట్స్ చేశాడు అయినా రిజల్ట్ తేడా కొట్టేసింది. సురేందర్ రెడ్డి పై అఖిల్ భారీ ఆశలు పెట్టుకున్నాడు కానీ ఏం లాభం.. ఏజెంట్ సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. అప్పటి నుంచి అఖిల్ మళ్లీ ఎక్కడా కనిపించడంలేదు. ఏజెంట్ రిలీజ్ అయి 5 నెలలు అవుతున్నా కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు అఖిల్. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టుగా వినిపిస్తునే ఉంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాతో అనిల్ అనే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నాడట. దాదాపు ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అయిందని.. అనౌన్స్మెంట్ రావడమే లేట్ అంటున్నారు.

ఇప్పుడు అఖిల్ లిస్ట్‌లో ఇంకొన్ని కొత్త ప్రాజెక్ట్స్ తెరపైకి వస్తున్నాయి. తమిళ్ డైరెక్టర్ లింగుస్వామితో ఒక సినిమా చేసే ఛాన్స్ ఉందన్నారు కానీ ఇందులో నిజం లేదంటున్నారు. అలాగే శ్రీకాంత్ అడ్డాలతో ఓ సినిమా ఉంటుందని వినిపిస్తోంది. అయినా కూడా.. అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. ఫైనల్‌గా ఎన్ని పుకార్లు వినిపించినా.. అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ యూవీ క్రియేషన్స్‌లోనే ఉంటుందని అంటున్నారు. 2024 జనవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. వీలైనంత త్వరగా షూటింగ్ చేసి.. 2025లో ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి అఫిషీయల్ అనౌన్స్మెంట్ ఎప్పుడుంటుందో చూడాలి.