Allu Arjun Wishes Allu Sneha Reddy on Her Birthday: అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి నటి కాకపోయినా తెలుగు ప్రేక్షకులకు అందరికీ పరిచయమే. ఎప్పుడూ సోషల్ మీడియాలో సందడి చేసే ఆమె ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ గురించి, అల్లు అర్జున్ సినిమా గురించి అందులో అప్డేట్ కూడా ఇస్తూ ఉంటుంది. ఇక సినిమాలో నటించక పోయినా హీరోయిన్లకే షాక్ ఇచ్చేలా ఫ్యాషన్ దుస్తులు ధరిస్తూ ఫాలోయింగ్ గట్టిగానే సంపాదించుకున్నారు. ఈరోజు అల్లు స్నేహా రెడ్డి పుట్టిన రోజు కావడంతో ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన భార్యను ఒక పర్సనల్ వీడియో షేర్ చేస్తూ విష్ చేశారు. ఆమె జిమ్ వేర్ లో ఉన్న వీడియోను షేర్ చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ‘హ్యాపీ బర్త్ డే క్యూటీ.. నా జీవితపు వెలుగు’ అంటూ వీడియోకు క్యాప్షన్ పెట్టారు.
ఇక ఆమె పుట్టినరోజు కావడంతో బుల్లితెర సెలబ్రెటీలు అనేక మంది స్నేహా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అల్లు స్నేహారెడ్డి 1985 సెప్టెంబర్ 29న జన్మించగా ఈ ఏడాదితో 33వ ఏటా అడుగుపెట్టారు. SIT ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చైర్మన్, బిజినెస్ మెన్ సీ శేఖర్ రెడ్డి కూతురయిన స్నేహా రెడ్డి కామన్ ఫ్రెండ్ పెళ్లిలో తొలిసారిగా బన్నీతో పరిచయం ఏర్పడి కొన్నాళ్లు ప్రేమలో ఉండి 2011 మార్చి 6న వివాహం చేసుకునాన్రు. ఏ దంపతులకు కొడుకు అల్లు అయాన్, కూతురు అల్లు అర్హ ఉన్న విషయం తెలిసిందే. ఇక బన్నీ ప్రస్తుతం Pushpa 2 The Rule సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు అధికారికంగా ప్రకటించారు.