Leading News Portal in Telugu

Health Tips : ఆ సమస్యలకు కలబందతో చెక్.. ఇలా వాడితే ఇక డాక్టర్ అవసరం ఉండదు..


కలబంద గురించి అందరికీ తెలుసు.. ఇది పెరటి వైద్యం.. ఎన్నో రోగాలను నయం చేసే అద్భుతమైన ఔషదం.. ఒకసారి నాటి వదిలేస్తే చాలు దానంత అదే బతికేసే ఈ మొక్క లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. చర్మ సంబంధమైన రోగాలకు, కాలిన, తెగిన గాయాలకు ఇది చక్కని పరిష్కారం.. జీర్ణ సమస్యల ను తగ్గిస్తుంది.. కలబందతో ఎన్నో ఆరోగ్య సమస్యలు నయం అవుతాయి.. అవేంటో ఓ లుక్ వేద్దాం పదండీ..

*. జీర్ణవ్యవస్థలో పేరుకు పోయిన వ్యర్థ, విష పదార్థాలను బయటకు పంపుతుంది. ఉదయాన్నే పరగడుపున కలబంద ఆకును తింటే, కడుపులో ఉన్న అన్ని రకాల వ్యాధులను మటుమాయం చేస్తుంది..

*. శరీరం పై ఎక్కడైనా కాలిన చోట కలబంద రసం వాడితే పూర్తి ప్రయోజనం చేకూరుతుంది. దీర్ఘ వ్యాధులకు కూడా అమోఘంగా పనిచేస్తుంది. కలబంద మొక్క ఇంటిలో ఉంటే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు..

*. ఈ గుజ్జును ఫేస్ కు అప్లై చేసుకొని కడుక్కోవడం వల్ల మంచి చర్మ నిగారింపు పెరగడం తో పాటు మృధువుగా మారుతుంది.. కలబంద ఆకురసంతో నల్లమచ్చలు పోగొట్టవచ్చు.

*. కలబంద గుజ్జు మధుమేహం, కీళ్ళ నొప్పులు, జీర్ణకోశ, స్త్రీ సంబంధమైన వ్యాధులకు దివ్య  ఔషధంగా పనిచేస్తుంది. కలబంధ గుజ్జుతో తయారైన జ్యూస్‌ను తాగడం వలన దీర్ఘకాలం ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు..

*. చివరగా జుట్టు సంరక్షణ లో కూడా కలబంద భేష్.. చుండ్రు సమస్యలు తగ్గి ఒత్తుగా పెరుగుతుంది..

*. రోజు ఒక చిన్న ముక్కను పరగడుపున తీసుకుంటే ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి..