Leading News Portal in Telugu

Health Tips : కొత్తిమీరను రోజూ తింటున్నారా? అయితే ఏం అవుతుందో చూడండి..


కొత్తిమీరను రోజు మనం వంటల్లో వాడుతూ ఉంటాము.. రుచిని పెంచడం తో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.. కొత్తిమీర ఆకులనే కాదు కొత్తిమీర గింజలు అంటే ధనియాలను కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.. మరి కొత్తిమీరను రోజు తింటే ఏమౌతుందో తెలుసుకుందాం..

మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితులు వల్ల ఎన్నో రోగాల బారిన పడేస్తుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా డయాబెటీస్, గుండె జబ్బులు, రక్తపోటు సంబంధిత వ్యాధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇలాంటి వ్యాధులు మనకు రావొద్దంటే మన రోజువారి ఆహారంలో కొన్ని మార్పులు తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..

కొత్తిమీర మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది ఫుడ్ రుచిని బాగా పెంచుతుంది. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఎన్నో ప్రాణాంతక రోగాలు వస్తాయి.. రోజూ కొత్తిమీరను తింటే ఈ కొలెస్ట్రాల్ స్థాయిళు తగ్గిపోతాయని చెబుతున్నారు..

ఈ కొత్తిమీరను ఎప్పటి నుంచో వాడుతున్నారు.. పురాతన కాలంలో ఈజిప్షియన్లు, గ్రీకులు దీన్ని జీర్ణ సమస్యలు, అధిక కొలెస్ట్రాల్ వంటి ఎన్నో సమస్యలను తగ్గించుకోవడానికి ఉపయోగించారు. ప్రస్తుతం కొత్తిమీర ఆకులను, గింజలను, పొడిగా దీన్ని ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ కొత్తిమీర ఆకులు, విత్తనాలు వేర్వేరు రుచిని కలిగి ఉంటాయి..వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది ఎల్డిఎల్ లేదా ‘చెడు’ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా ఉపయోగపడుతుంది. అంతేకాదు కొత్తిమీర అథెరోస్క్లెరోసిస్, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.. ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలను ఈ కొత్తిమీర దూరం చేస్తుంది.. ఇది చదివికా కొత్తిమీరను వాడటం అలవాటు చేసుకోండి..