Leading News Portal in Telugu

Seediri Appalaraju: 6 నెలల్లో కురుక్షేత్రం.. ఏపీని కాపాడుకోవాలంటే జగన్ వల్లే సాధ్యం


Seediri Appalaraju: 6 నెలల్లో కురుక్షేత్రం జరగబోతోంది.. ఆంధ్రప్రదేశ్‌ని కాపాడుకోవాలంటే వైఎస్‌ జగన్‌ వల్లే సాధ్యం అన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు.. శ్రీకాకుళం జిల్లా జగనన్న సురక్ష కార్యక్రమంపై జరిగిన అవగాహన సదస్సులో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరు నెలల్లో కురుక్షేత్రం మొదలవబోతోంది.. రెండు కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలని సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు.. జగనన్న సురక్ష.. ఆంధ్రాకి జగన్‌ ఎందుకు కావాలి అనే కార్యక్రమాలు చెపడుతున్నాం.. నూతన ఆంధ్రప్రదేశ్‌ని నిర్మిస్తున్నాం.. అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.. వైఎస్‌ జగన్‌ మేలుకోలేకపోతే రాష్ట్రాన్ని చంద్రబాబు ఏవిధంగా దోచుకునేవారో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్ వల్లే పేదవారు తలెత్తుకు తిరుగుతున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే.. జగన్ వల్లే సాధ్యం అన్నారు. ప్రతిపక్షం వికృత రూపం అందరికీ అర్థం అవుతోంది.. అభివృద్ధి కార్యక్రమాలను కూడా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు మంత్రి సీదిరి అప్పలరాజు.