రష్యా కిరాయి సైనిక దళం వాగ్నర్ గ్రూపు చీఫ్ ప్రిగోజిన్ ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పెంచి పోషించిన ప్రైవేట్ఆర్మీ “వాగ్నర్ గ్రూప్” ఈ ఏడాది జూన్ 23న ఆయనపైనే తిరగబడింది. పుతిన్‌పై తిరుగుబాటును లేవనెత్తిన ప్రైవేట్ ఆర్మీ చీఫ్ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించిగా అతని మృతిపై పలు దేశాలు అనుమానం కూడా వ్యక్తం చేశాయి. పుతిన్ కు ఎదురుతిరగడం వల్లే ప్రిగోజిన్ కాలగర్భంలో కలిసిపోయాడంటూ అనేక కథనాలు కూడా వచ్చాయి. ఇక తాజా ఈ కిరాయి దళానికి నాయకుడిని ఎంపిక చేశారు పుతిన్. కొత్త అధిపతిగా ఆండ్రీ ట్రోషెవ్‌ను ఆయన ఎంపిక చేశారు. ఈయన సైనిక దళంలోనే పలు స్థాయిల్లో పనిచేశారు.