ఆసియా క్రీడలు 2023లో పాకిస్థాన్‌తో జరిగిన పూల్-ఎ మ్యాచ్‌లో భారత హాకీ జట్టు చారిత్రాత్మక ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ 10-2 తేడాతో విజయం సాధించింది. దీంతో పాకిస్తాన్ సెమీస్ కు చేరే అవకాశాలు తక్కువ చేసింది. ఈ మ్యాచ్‌లో భారత హాకీ జట్టు ఫస్ట్ హాఫ్ నుంచే తన పట్టును పటిష్టం చేసుకుని 2-0తో ముగించింది. దీంతో సెకండాఫ్ ముగిసేసరికి స్కోరు 4-0కి చేరుకుంది.
Swayambhu : స్వయంభు కోసం కత్తి సాము నేర్చుకుంటున్న నిఖిల్..
పాకిస్థాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ అత్యధికంగా 4 గోల్స్ చేశాడు. వరుణ్ 2 గోల్స్ చేయగలిగాడు. వీరితో పాటు షంషేర్, మన్‌దీప్, లలిత్, సుమిత్ తలో గోల్ చేశారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఫస్టాఫ్ 8వ నిమిషంలో తొలి గోల్ చేసింది. ఆ తర్వాత 11వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్‌లో రెండో గోల్ వచ్చింది. సెకండాఫ్ ప్రారంభం కాగానే పెనాల్టీ కార్నర్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ అద్భుతమైన గోల్ చేశాడు. సెకండాఫ్ ముగిసేలోపు సుమిత్, లలిత్, గుర్జంత్ అద్భుతమైన సమన్వయాన్ని ప్రదర్శించి నాలుగో గోల్ సాధించారు. దీంతో సెకండాఫ్ ముగిసేసరికి ఈ మ్యాచ్‌లో భారత్ 4-0తో ఆధిక్యంలో ఉంది.
Communal Tension: జైపూర్‌లో మత ఉద్రిక్తత.. అపార్ధం చేసుకుని ఒక వ్యక్తి హత్య..
ఈ మ్యాచ్ థర్డ్ ఆఫ్ ప్రారంభం కాగానే లయను నిలబెట్టుకున్న భారత్.. పెనాల్టీ స్ట్రోక్ ద్వారా ఐదో గోల్ సాధించింది. ఆ తర్వాత.. పెనాల్టీ స్ట్రోక్‌లో పాకిస్తాన్ ఒక గోల్ చేసింది. అయితే.. భారత్ మరో 2 గోల్స్ చేసి స్కోరు లైన్‌ను 7-1కి తీసుకువెళ్లింది. థర్డాఫ్ ముగిసేలోపు పాకిస్థాన్ మరో గోల్ చేసి స్కోరు లైన్‌ను 7-2కు పెంచుకుంది. మ్యాచ్ చివరి క్వార్టర్‌లోనూ జోరు కొనసాగించిన భారత్.. మరో 3 గోల్స్ చేసి 10-2 తేడాతో మ్యాచ్‌ని ముగించింది. ఈ మ్యాచ్‌లో పాక్ జట్టు నుంచి చాలా ప్రాథమిక తప్పులు చేసింది. తర్వాత జరిగే పూల్ ఏలో భారత్ తన చివరి మ్యాచ్‌ని బంగ్లాదేశ్‌తో ఆడనుంది.
Actors Fight: బంగ్లాదేశ్లో సినీ క్రికెట్ లీగ్.. పొట్టుపొట్టు కొట్టుకున్న నటులు
పూల్-ఎలో ఇప్పటివరకు భారత హాకీ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచి.. అన్ని మ్యాచ్‌ల్లో గెలిచింది. ఉజ్బెకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 16-0తో విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో సింగపూర్ జట్టుపై భారత్ 16-1తో విజయం సాధించింది. మూడో మ్యాచ్‌లో పటిష్టమైన జపాన్‌పై 4-2తో ఉత్కంఠ విజయం సాధించింది.