బెంగాల్ నుండి 4వేల మంది MNREGA కార్మికులతో సహా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలు రైలులో ఢిల్లీకి బయల్దేరారు. అక్టోబర్ 2, 3 తేదీల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే నిరసనల్లో పాల్గొనేందుకు వెళ్తున్నారు. MNREGA నిధులను నిలిపివేయడం, ఇతర సమస్యలపై మమతా సర్కార్.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతుంది. ఈ నేపథ్యంలో దాదాపు 4,000 మంది MNREGA కార్మికులు ఈ నిరసనలో పాల్గొననున్నారు.
Audimulapu Suresh: ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్మెంట్ ఎలా ఉండాలనేది లోకేశ్ కనుసన్ననలోనే జరిగింది..?
నిరసన గురించి సమాచారం ఇస్తూ, పశ్చిమ బెంగాల్ పార్టీ ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ మీడియాతో మాట్లాడారు. TMC నాయకులు అక్టోబర్ 2 నుండి 3 వరకు నిరసనలో పాల్గొనడానికి ఢిల్లీకి వెళ్తున్నారు. బకాయిలు, ఇతర సమస్యలపై కేంద్రంపై నిరసన తెలియజేస్తామని తెలిపారు. అక్టోబరు 3వ తేదీన జంతర్ మంతర్ వద్ద ఈ నిరసన కార్యక్రమం జరగనుందని పేర్కొన్నారు. ఈ నిరసనకు టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ నేతృత్వం వహిస్తారని తెలిపారు. 100 రోజులుగా జీతాలు లేకుండా పనిచేసిన ఉద్యోగులు ఈ నిరసనలో పాల్గొంటారని చెప్పారు. రైళ్లలో, బస్సుల్లో పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, MNREGA జాబ్ కార్డ్ హోల్డర్లు ఢిల్లీకి చేరుకుంటారని తెలిపారు.
TDP Motha Mogiddam: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా మోత మోగించిన టీడీపీ నేతలు
నిరసన కార్యక్రమంపై ఎంపీ అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, పశ్చిమ బెంగాల్‌పై పోరాటం, దాని హక్కులను హరించడం కొనసాగుతుంది అని అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రజల కోసం, వారి ప్రాథమిక హక్కుల కోసం పోరాడాలనే తన అంకితభావాన్ని ప్రపంచంలోని ఏ శక్తి అడ్డుకోలేదని తెలిపారు. అక్టోబరు 2, 3 తేదీల్లో నిరసనలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్తానని.. మీరు నన్ను ఆపగలిగితే, ఆపండని పేర్కొన్నారు.
Aditya-L1: కీలక మైలురాయిని దాటిన ఆదిత్య ఎల్1.. భూమి ప్రభావాన్ని తప్పించుకుని ఎల్1 దిశగా ప్రయాణం..
అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా రాజ్‌ఘాట్‌లో మమతా బెనర్జీ, టీఎంసీ ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా స్థాయి నాయకులు ఆయనకు నివాళులర్పించనున్నారు. అనంతరం TMC ప్రతినిధి బృందం అక్టోబర్ 3న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌ను కలువనున్నారు. MNREGA కింద బకాయిలు విడుదల చేయకపోవడంపై ఆయనకు మెమోరాండం అందజేయనున్నారు.