Leading News Portal in Telugu

Tollywood Shootings: పబ్బులో శర్వానంద్, స్పెషల్ సెట్టులో మహేష్ బాబు..షూటింగ్ అప్డేట్లు ఇవే!


Tollywood Shooting Updates as on 30th September 2023: తెలుగు సినీ పరిశ్రమలో అనేక సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ఏఏ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి? ఏఏ సినిమాల షూటింగ్ ఏ దశలో ఉంది? అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నాగార్జున హీరోగా నటిస్తున్న నాసామి రంగ సినిమా షూటింగ్ ఓఆర్ఆర్ దగ్గరలో జరుగుతోంది. ఇక బెన్నీ మాస్టర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాగార్జున మినహా మిగతా నటీనటులకు సంబంధించిన షూట్ జరుగుతోంది. ఇక మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరక్షన్లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ హైదరాబాద్లో నిర్మించిన ఒక స్పెషల్ హౌస్ సెట్ లో జరుగుతోంది. మహేష్ బాబు కూడా ఈ షూట్ లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది.

RC 16: రామ్ చరణ్ 16లో స్టార్ హీరోయిన్ కూతురు?

ఇక శర్వానంద్ హీరోగా నటిస్తున్న శర్వా 30 సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని ఒక పబ్బులో జరుగుతోంది. ఇక విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా షూటింగ్ కూడా హైదరాబాద్ లో జరుగుతోంది. విజయ్ దేవరకొండ అండ్ టీమ్ మీద కొన్ని సీన్లు షూట్ చేస్తున్నారు. ఇక అంజలి హీరోయిన్ గా నటిస్తున్న గీతాంజలి సినిమా సీక్వెల్ గీతాంజలి2 సినిమా షూటింగ్ కూడా హైదరాబాద్ లో శ్రీనివాస్ రెడ్డి, సత్య అలాగే ఇతరుల మీద జరుగుతోంది. ఇక మరోపక్క పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ సెకండ్ షెడ్యూల్ పూర్తయింది. ఇక ఇవండీ ఈరోజు తెలుగు సినిమాల షూటింగ్ అప్డేట్స్.