Leading News Portal in Telugu

Minister Kakani: అవినీతికి పాల్పడటంలో చంద్రబాబు దిట్ట


స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అవినీతి జరిగింది అనే విషయం అందరికీ తెలిసిందే అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. అక్రమాలు జరగలేదని ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు హడావిడి చేస్తూన్నారు.. టీడీపీ నేతలు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి వెళ్లి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కు వెళ్లి అభాసు పాలయ్యారు అని ఆయన అన్నారు. విశ్వవిద్యాలయానికి ఈ పథకానికి సంబంధం లేదని చెప్పడంతో ఆదిశంకరా కళాశాలకు వెళ్లారు.. అక్కడ పది కోట్లు పెట్టామని చెప్పారు.. పది కోట్లు పెట్టినట్లు రుజువు చేస్తే ఏమి చేసేందుకైనా సిద్ధం.. వాస్తవంగా రూ.80 కోట్లు ఇవ్వాలి.. ఇందులో రూ.70 కోట్లు తినేశారు అని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు.

కళాశాల యజమాన్యాన్ని అడిగితే వీటి విలువ రెండు కోట్ల రూపాయలు కూడా ఉండదని స్పష్టం చేశారు అని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. పరికరాలకు సంబంధించి ఇన్ వాయిస్ ఉండాలి అందులో ధర కూడా పొందుపరచాలి.. 10 కోట్ల రూపాయలు కూడా ఇచ్చినట్లు రుజువు చేస్తే నేను రాజకీయాల నుంచి వైదొలగుతానంటూ కాకాణీ సవాల్ విసిరారు. నిన్న కంచాలు.. గరిటలు మోగించి హడావిడి చేశారు.. నిరుద్యోగుల కంచాల్లో పెట్టాల్సిన అన్నాన్ని టిడిపి నేతలు తినేసారు.. అవినీతికి పాల్పడటంలో చంద్రబాబు దిట్ట అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు.

అక్రమంగా అవినీతి చేశారు అందుకే సక్రమంగా చంద్రబాబును అరెస్టు చేశారు అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఇక్కడ ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకిన లోకేష్ ఢిల్లీకి వెళ్లి కూర్చున్నాడు.. అక్కడ లోకేష్ కు ఏమి చేయాలో అర్థం కావడం లేదు.. టీడీపీ నేతలకు సిగ్గు ఉంటే ప్రధానమంత్రి కార్యాలయం ఎదుట కంచాలు మోగించాలి అని ఆయన మండిపడ్డారు. లేదా ఆదాయపన్ను శాఖ లేక ఈడీ కార్యాలయం ముందు కొట్టాలి.. ఇన్నర్ రింగ్ రోడ్డు… ఫైబర్ నెట్ లో కూడా అక్రమాలు జరిగాయి.. చంద్రబాబు అరెస్టుకు చేపట్టిన నిరసన కార్యక్రమాలలో భాగంగా ఈలలు వేసి డప్పులు కొట్టి టిడిపి నేతలు సంబరాలు జరుపుకున్నారు.. చంద్రబాబు హయాంలో పెట్టిన 42 కేంద్రాల్లో ఒక కేంద్రంలో నైనా ఇన్ వాయిస్ తీసుకు రాగలరా అని మంత్రి కాకాణి అన్నారు.