Leading News Portal in Telugu

MS Dhoni Hairstyle: ఎంఎస్ ధోనీ నయా హెయిర్ స్టైల్.. పోలా అదిరిపోలా..!


MS Dhoni New Hairstyle Ponytail Goes Viral: భారత క్రికెట్‌లో దిగ్గజం సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి క్రేజ్ సంపాదించింది మాజీ కెప్టెన్ ‘ఎంఎస్ ధోనీ’ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆటగాడిగానే కాకుండా.. కెప్టెన్‌గా టీమిండియాకు అన్ని ఫార్మాట్స్‌లో ధోనీ విజ‌యాలు అందించాడు. ఏ కెప్టెన్‌కు సాధ్యంకాని రీతిలో మూడు ఐసీసీ ట్రోఫీలు (2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్ ట్రోఫీ) గెలిచాడు. ధోనీ తన ఆట, కెప్టెన్సీతో క్రికెట్‌లో ‘ఐకాన్’గా నిలిచాడు. మహీ తన ఆటతోనే కాదు.. హెయిర్ స్టైల్‌తోనూ ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. ఎప్పటికప్పుడు హెయిర్ స్టైల్‌లు మార్చే ధోనీ.. తాజాగా మరో కొత్త హెయిర్ స్టైల్‌తో దర్శనమిచ్చాడు.

భారత జట్టులో హెయిర్ స్టైల్ సంస్కృతికి జార్ఖండ్ డైనమైట్ ఎంఎస్ ధోనీ నాంది పలికిన విషయం తెలిసిందే. కెరీర్ ఆరంభంలో పొడవాటి జుంపాల జుట్టుతో జట్టులోకి వచ్చిన ధోనీ.. హెయిర్‌ స్టైల్స్‌లో ఓ ట్రెండ్‌ను సెట్ చేశాడు. అప్పట్లో మహీ హెయిర్ స్టైల్‌కు యమ క్రేజ్ ఉండేది. చాలా మంది జుంపాల జట్టును పెంచుకొని.. ధోనీ స్ట్రైల్‌ను ఫాలో అయ్యారు. కేవలం యువకులే కాదు పాకిస్థాన్ మాజీ ప్రధాని పర్వేజ్ ముషార్రఫ్ సైతం అతడి హెయిర్ స్టైల్‌కు ముగ్ధుడయ్యాడు.

2007లో టీమిండియాకు టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను అందించిన తర్వాత ఎంఎస్ ధోనీ తన జుంపాల జట్టును కత్తిరించాడు. అయితే విభిన్న హెయిర్ స్ట్రైల్స్‌తో ఫ్యాన్స్‌ను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే ఎన్నో స్ట్రైల్స్‌లో దర్శమిచ్చిన మహీ.. తాజాగా స్టైలిష్ పోనీటైల్‌తో మెరిశాడు. తాజాగా ఓ కార్యక్రమంకు పోనీటైల్‌ స్టైల్‌లో హాజరయ్యాడు. ఇందుకుసంబంధించిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘ ఎంఎస్ ధోనీ పోనీటైల్‌ హెయిర్‌స్టైల్‌లో ఉన్నాడు. తలా కొత్త లుక్’ అని క్యాప్షన్ ఇచ్చారు. సోషల్ మీడియాలో అభిమానులు ధోనీ కొత్త లుక్‌పై కామెంట్స్ చేస్తున్నారు.