Leading News Portal in Telugu

Dharmana Prasada Rao: రెవెన్యూ శాఖలో పలు సంస్కరణలు తీసుకొచ్చింది మన ప్రభుత్వమే..!


ప్రపంచంలో ఎవరికీ లేనన్ని ఇబ్బందులు మనకు వచ్చాయని రెవెన్యూ శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.. సీసీఎల్ఏ సాయిప్రసాద్ ను ఆ స్ధానంలో సీఎం జగన్ పెట్టారు అని ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అనే కంటే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ & జనరల్ అడ్మినిస్ట్రేషన్ అని పిలవాలి అని చెప్పారు. భూమిపై సంపూర్ణ హక్కు అందించడం అవసరం.. 1977లో ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్సఫర్ యాక్ట్ వచ్చింది..
ఏదైనా సున్నితంగా తిరస్కరించడం తెలియాలి అని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు అన్నారు.

ఇప్పుడు అంతా డిజిటైజ్ అయిపోయింది.. తప్పు చేయడం కుదరదు అని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు తెలిపారు. ఉద్యోగుల సమస్యలు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తాం.. ప్రభుత్వానికి ఉన్న మరి కొద్ది కాలంలో చేయగలిగినంత నేను మంత్రిగా చేస్తాను.. నిర్ణయాలు వెంట వెంటనే తీసుకుంటే ఉద్యోగులకు ఎలాంటి కష్టాలుండవు అని ఆయన అన్నారు. రెవెన్యూ శాఖలో పలు సంస్కరణలు మన ప్రభుత్వం చేసింది.. నీతి ఆయోగ్ ఇచ్చిన మోడల్ ప్రకారం టైటిల్ డీడ్ ఇవ్వడం జరుగుతుంది.. 30 లక్షల ఎకరాల అసైన్డ్ భూమిని ప్రజలకు పంచడం జరిగింది.. నేను మంత్రిగా ఫైల్ ను పరిశీలించాలని రాస్తే సీబీఐ పట్టింది అని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు చెప్పారు.