Leading News Portal in Telugu

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్కు మరో రెండు స్వర్ణాలు


Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్ పసిడి పంట పండిస్తుంది. తాజాగా భారత్ ఖాతాలో మరో రెండు గోల్డ్​ మెడల్స్​ చేరాయి. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌, షాట్‌ఫుట్‌ విభాగాల్లో గోల్డ్ మెడల్స్​ వచ్చాయి. 3000 మీటర్ల స్టీపుల్​చేజ్​లో భారత క్రీడాకారుడు అవినాశ్ సాబ్లే స్వర్ణం సాధించాడు. దీంతో ఆసియా క్రీడల్లో 3000 స్టీపుల్​చేజ్​లో స్వర్ణం సాధించిన మొదటి భారతీయుడిగా అవినాశ్​ సాబ్లే​ చరిత్ర లిఖించాడు. 29 ఏళ్ల అవినాష్ సాబ్లే 8:19.50 సెకన్లలో రేసును పూర్తి చేశాడు. 2018 జకార్తా గేమ్స్‌లో ఇరాన్‌కు చెందిన హోస్సేన్ కెహానీ నెలకొల్పిన 8:22.79 సెకన్ల ఆసియా రికార్డును అతను బద్దలు కొట్టాడు. అవ్నిషా కంటే ముందు.. సుధా సింగ్ 2010 గ్వాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఈవెంట్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుంది.

ఇక షాట్‌పుట్‌లో భారత ‘బాహుబలి’ తేజిందర్‌పాల్‌ సింగ్‌ తూర్‌ స్వర్ణం సాధించాడు. అందరి కన్నా ఎక్కువగా 20.36 మీటర్లు విసిరి విజేతగా నిలిచాడు. ఆసియా క్రీడల్లో తజిందర్‌పాల్‌ సింగ్‌ వరుసగా రెండోసారి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అంతకుముందు జకార్తా ఆసియా క్రీడల్లో తజిందర్‌పాల్ సింగ్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. తాజిందర్‌పాల్ సింగ్ మొదటి రెండు ప్రయత్నాలు ఫౌల్‌ అయ్యాయి. దాని కారణంగా. తజిందర్‌పాల్ సింగ్ తన మూడో ప్రయత్నంలో 19.21 మీటర్ల త్రోతో తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాడు. తొలి రెండు ప్రయత్నాల్లో ఫౌల్ చేసిన తజిందర్‌పాల్ సింగ్ మూడో ప్రయత్నంలో 19.51 మీటర్లు విసిరాడు. ఆ తర్వాత తాజిందర్‌పాల్ సింగ్ నాలుగో త్రోలో 20.06 మీటర్లు విసిరారు. ఆ తర్వాత ఐదో త్రో మళ్లీ ఫౌల్ అయింది. తాజిందర్‌పాల్ సింగ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న తర్వాత భారత్ బంగారు పతకాల సంఖ్య 13కు చేరింది. ఇవే కాకుండా 16 రజతాలు, 16 కాంస్య పతకాలను గెలుచుకుంది. దీంతో భారత్ పతకాల సంఖ్య 45కి చేరింది.