TATA Group Stocks: టాటా గ్రూపునకు చెందిన 28 కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి. వాటిలో 24 కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరంలో రెండంకెల రాబడిని ఇచ్చాయి. ఈ స్టాక్స్ ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందించాయి. అయితే, టాటా గ్రూప్‌లోని కొన్ని స్టాక్స్ కూడా క్షీణించాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో లేదా ఆరు నెలల్లో 154 శాతం రాబడిని అందించిన టాటా గ్రూప్‌కు చెందిన 12 స్టాక్‌ల గురించి తెలుసుకుందాం. టాటా గ్రూప్‌కు చెందిన ఆర్ట్సన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ షేర్ల ప్రస్తుత ధర రూ.167.80, ఇది ఏప్రిల్ నుంచి 154 శాతం రాబడిని అందించగా ఆరు నెలల్లో 138 శాతం రాబడిని ఇచ్చింది. దీని షేర్లు శుక్రవారం దాదాపు 2 శాతం పడిపోయాయి. టాటా గ్రూప్‌తో అనుబంధం ఉన్న గోవా ఆటోమొబైల్ కంపెనీ శుక్రవారం 1.40 శాతం పెరుగుదలతో ఒక్కో షేరు రూ.1,494.95 వద్ద ట్రేడవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 105 శాతం రాబడిని ఇచ్చింది. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ప్రస్తుత షేరు ధర రూ. 3,285 కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది 97 శాతం రాబడిని ఇచ్చింది.
అదేవిధంగా, బనారస్ హోటల్స్ లిమిటెడ్ షేర్ల ధర రూ. 5,850. ఇది 2024 ఆర్థిక సంవత్సరంలో 79 శాతం పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో టాటా టెలిసర్వీసెస్ 77 శాతం జంప్ చేసి ప్రస్తుతం రూ.99.45 వద్ద ట్రేడవుతోంది. Tayo Rolls ఒక షేరు ధర ప్రస్తుతం రూ. 91.50. ఈ ఆర్థిక సంవత్సరంలో 76 శాతం పెరిగింది. టాటా గ్రూప్ కంపెనీలలో టాటా కమ్యూనికేషన్ షేర్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 52 శాతం పెరిగాయి. శుక్రవారం ఒక్కో షేరుకు రూ.1,925.20 వద్ద ట్రేడవుతోంది. నెల్కో ఏప్రిల్ నుంచి 50 శాతం పెరిగి రూ.780.20 వద్ద ట్రేడవుతోంది. ట్రెంట్ ఒక్కో షేరుకు రూ. 2,082.65 వద్ద ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో 50 శాతం పెరిగింది. తేజస్ నెట్వర్క్ ఒక్కో షేరు 48 శాతం పెరిగి రూ.874.80 వద్ద ట్రేడవుతోంది. టీఆర్ఎఫ్ 47 శాతం పెరిగి రూ.238.50 వద్ద ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో టాటా మోటార్స్ 46 శాతం వృద్ధి చెంది ఒక్కో షేరు రూ.631కి చేరుకుంది.