Leading News Portal in Telugu

Jithender Reddy : జితేందర్ రెడ్డి గా బాహుబలి నటుడు.. వైరల్ అవుతున్న ఫస్ట్ లుక్..


దర్శకుడు విరించి వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఉయ్యాలా జంపాలా, మజ్ను సినిమాల తో డైరెక్టర్‌ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విరించి వర్మ. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తెరకెక్కించే సినిమాలు ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకుంటాయి. తాజాగా ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం జితేందర్‌ రెడ్డి. మంచి లవ్ ట్రాక్‌ స్టోరీలతో అందరినీ ఆకట్టుకున్న విరించి వర్మ ఏడేళ్ల గ్యాప్ తర్వాత యూటర్న్‌ తీసుకొని పొలిటికల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.అయితే ఈ సినిమా లో ఎవరు హీరోగా నటిస్తున్నారనేది సస్పెన్స్‌ లో పెడుతూ రిలీజ్ చేసిన సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. బాహుబలి, ఎవరికీ చెప్పొద్దూ,మిర్చి వంటి సినిమాల్లో అద్భుతం గా నటించి మెప్పించిన రాకేశ్‌ వర్రె ఈ సినిమా లో హీరో గా నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే ముందుగా వచ్చిన ఆ వార్తలే నిజమయ్యాయి. జితేందర్‌ రెడ్డి పాత్ర లుక్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. రాకేశ్‌ వర్రె తెల్ల చొక్కా, ఖాకీ ప్యాంట్‌ లో చేతిలో తుపాకీ పట్టుకుని సూపర్ స్టైలిష్‌గా కనిపించాడు. జితేందర్‌ రెడ్డి ఫస్ట్ లుక్‌ సినిమా పై అంచనాలు పెంచుతోంది. హీరోగా రాకేష్ వర్రె సక్సెస్ అందుకోవడం ఖాయం అని తాజా లుక్‌ చూస్తుంటేనే అర్ధం అవుతుంది.. ఈ చిత్రాన్ని ముడుగంటి క్రియేషన్స్‌ బ్యానర్‌పై రవిందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్ గా ఉమ రవీందర్ అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వాణిశ్రీ పొడుగు వ్యవహారిస్తున్నారు. అలాగే వీఎస్‌ జ్ఞానశేఖర్‌ ఈ సినిమాకు సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.తన ట్యూన్స్ తో యూత్ ని ఎంతగానో ఆకట్టుకునే గోపీసుందర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.. అలాగే ఈ సినిమాకు సంబంధించి ఇతర వివరాలు మేకర్స్ త్వరలోనే తెలియజేయనున్నారు.మరి ఈ సినిమాతో రాకేష్ వర్రె ఏవిధంగా మెప్పిస్తాడో చూడాలి..