Leading News Portal in Telugu

Minister KTR: ఐటెక్‌ న్యూక్లియస్‌ ఐటీ టవర్‌.. నిర్మాణానికి భూమిపూజ చేసిన కేటీఆర్‌


Minister KTR: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తలసరి ఆదాయంతో పాటు అనేక అంశాల్లో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ గా నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ స్టీరింగ్ కేసీఆర్ చేతిలో.. ఎంఐఎం స్టీరింగ్ అసదుద్దీన్ చేతిలో.. బీజేపీ స్టీరింగ్ అదానీ చేతిలో ఉందని విమర్శించారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హర్యానా రాష్ట్రాలు అధిగమించాయని చెప్పారు. తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా మారిందని అన్నారు. హైదరాబాద్‌లోని మలక్‌పేటలో ఐటెక్‌ న్యూక్లియస్‌ ఐటీ టవర్‌ నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టును తక్కువ సమయంలో పూర్తి చేశారన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధి దేశానికి నిదర్శనం అన్నారు.హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాలకు మెట్రోను విస్తరిస్తామని చెప్పారు. పాతబస్తీకి మెట్రో తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.

మూసీ ఆధునికీకరణ పనులు త్వరలో పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో గతంలో తరుచూ కర్ఫ్యూ పరిస్థితులు ఉండేవన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో తొమ్మిదేళ్లుగా రాష్ట్రం ప్రశాంతంగా ఉందన్నారు. మలక్ పేట అంటే చిన్నప్పుడు టీవీ టవర్ అని, రానున్న రోజుల్లో మలక్ పేట అంటే ఐటీ టవర్ అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 44.20 ఎకరాల్లో ఐటీ టవర్‌ను నిర్మించాలని నిర్ణయించిందన్నారు. కానీ మొదటి దశగా రూ.1,032 కోట్లతో 10.35 ఎకరాల్లో 21 అంతస్తులు, 20 లక్షల చదరపు అడుగులతో ఐటెక్‌ న్యూక్లియస్‌ ఐటీ టవర్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. 36 నెలల్లో ఐటీ టవర్ నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు. మైక్రోసాఫ్ట్, అడోబ్ లాంటి పెద్ద కంపెనీలను ఇక్కడికి తీసుకువస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో ఐటీ రంగం దూసుకుపోతోందన్నారు. బెంగళూరు కంటే ఐటీ ఉద్యోగాలు ఎక్కువగా లభిస్తున్నాయి.
Postal Department: డెలివరీ సమయంలో పార్శిల్ ట్యాంపరింగ్.. పోస్టల్ శాఖకు రూ.20 వేల ఫైన్