Leading News Portal in Telugu

Health Tips : రోజూ 30 నిమిషాల వాకింగ్ చెయ్యడం వల్ల కలిగే లాభాలెంటో తెలుసా?


నడక ఆరోగ్యానికి మంచిదే.. ఎంత ఎక్కువగా నడిస్తే అంత ఆరోగ్యం.. అయితే ఈరోజుల్లో నడవడం మానేశారు.. దాంతో బరువు పెరగడం దగ్గరనుంచి ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.. రోజూ 15 నుండి 30 నిమిషాల పాటు ఖచ్చితంగా నడవాలని చెబుతున్నారు. నడవడానికి సమయాన్ని తప్పకుండా కేటాయించాలని వారు చెబుతున్నారు. నడవడానికి సమయాన్ని కేటాయించాలంటే నడవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలను ముందుగా తెలుసుకోవాలి. రోజూ అరగంట పాటు నడవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

రోజూ కాసేపు నడవడం వల్ల మెదడు చురకుగా పని చేస్తుంది. నడవడం వల్ల శరీరంలో ఎండోర్ఫిన్ విడుదల అవుతుంది. దీంతో ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా అల్జీమర్స్, డైమెన్షియా వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. నడవడం వల్ల మన కంటి ఆరోగ్యం పెరుగుతుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు కానీ నిజం.. అంతేకాకుండా నడవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.. అలాగే షుగర్ కూడా కంట్రోల్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు..

జీర్ణక్రియ చురుకుగా పని చేస్తుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. రోజూ నడవడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. ఎముకలు పెలుసుగా మారకుండా గట్టిపడతాయి. కీళ్లు బలంగా మారడంతో పాటు కీళ్ల నొప్పులు తగ్గుతాయి.. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.. అలాగే ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.. ఇకపోతే మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. అందుకే రోజూ నడవడం మర్చిపోకండి..