Leading News Portal in Telugu

Team India: రేపే ఆసియా క్రీడల్లో క్రికెట్ సమరం.. భారత్-నేపాల్‌ మధ్య మ్యాచ్


రేపు( మంగళవారం) ఆసియా క్రీడలు 2023లో భాగంగా.. భారత్-నేపాల్ మధ్య క్వార్టర్-ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. హాంగ్‌జౌలోని పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ గ్రౌండ్‌లో మ్యాచ్ జరుగనుంది. ఈ టోర్నీలో తొలిసారిగా రుతురాజ్ గైక్వాడ్ భారత్ కు సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే ఆసియా క్రీడల్లో ఆడేందుకు భారత జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లకు చోటు దక్కింది. త్వరలో ప్రపంచకప్ ఉండటంతో.. యువ భారత జట్టును ఆసియా క్రీడలకు పంపాలని బీసీసీఐ నిర్ణయించింది. ఆసియా క్రీడల తొలి మ్యాచ్‌లో యువ ఆటగాళ్లలో ఎవరెవరు బరిలోకి దిగుతున్నారో చూద్దాం.

Pakistan: సౌదీకి వెళ్తున్న పాక్ బిచ్చగాళ్ల అరెస్ట్.. విమానం నుంచి దించి విచారణ..

భారత్‌కు తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రితురాజ్ గైక్వాడ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకోవడం అంత సులభం కాదు. ప్లేయింగ్ ఎలెవన్‌లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను ఓపెనర్‌గా చూడొచ్చు. అంతే కాకుండా.. యశస్వి జైస్వాల్ అతనితో ఓపెనర్గా దిగవచ్చు. ఎడమచేతి వాటం తిలక్ వర్మను మూడవ స్థానంలో చూడవచ్చు. ఇక మిడిల్ ఆర్డర్ రాహుల్ త్రిపాఠితో ఆరంభం కావచ్చు. ఆ తర్వాత.. ప్రభ్ సిమ్రాన్ సింగ్ వికెట్ కీపర్‌గా ఐదో నంబర్‌లో అవకాశం ఉంది. ఆ తర్వాత స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఆరో నంబర్‌లో దిగనున్నాడు. రింకూ సింగ్ ఏడవ స్థానంలో ఫినిషర్‌గా కనిపించవచ్చు. ఐర్లాండ్ టూర్‌లో రింకూ భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. ఇక బౌలింగ్ విభాగంలో.. స్పిన్నర్ రవి బిష్ణోయ్‌తో ప్రారంభించవచ్చు. స్పిన్ విభాగంలో బిష్ణోయ్‌కు వాషింగ్టన్ సుందర్ మద్దతు ఇవ్వనున్నాడు. ఫాస్ట్ బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్‌ ఉన్నారు.

Rahul Gandhi: దేశంలో కులగణన చాలా ముఖ్యం..

నేపాల్‌తో ఆడే టీమిండియా తుది జట్టు:
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రాహుల్ త్రిపాఠి, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.