Leading News Portal in Telugu

Unni Mukundan : ‘మార్కో’ గా అలరించబోతున్న మలయాళి నటుడు..


మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగు లో ‘ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ జనతా గ్యారేజ్ లో విలన్ గా నటించి మెప్పించాడు. ఆ తరువాత తెలుగు లో ‘భాగమతి’, ‘ఖిలాడీ’ మరియు ‘యశోద’ వంటి చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది చివర్లో ఉన్ని ముకుందన్ నటించిన మాలికాపురం అనే చిత్రం చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించింది.. దాదాపు 5 కోట్ల బడ్జెట్‌ తో వచ్చిన ఈ సినిమా వంద కోట్ల కలెక్షన్‌లు సాధించి భారీ రికార్డు సాధించింది. ఇదిలా ఉంటే ఉన్ని ముకుందన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ  మార్కో (Marco). మైఖేల్ మరియు ది గ్రేట్ ఫాదర్ సినిమాల ఫేమ్ హనీఫ్ అదేని ఈ సినిమా కు దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ డ్రామా గా రానున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఈ క్రమం లో సినిమాకు సంబంధించి మేకర్స్ ఓ సాలిడ్ అప్‌డేట్ ను ఇచ్చారు.ఈ మూవీ నుంచి మేకర్స్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ”మీరు అతని విలనిజం చూశారు కదా..ఇప్పుడు అతని హీరోయిజం చూస్తారు” అంటూ మోషన్ పోస్టర్‌ కు మేకర్స్ క్యాప్షన్ ను ఇచ్చారు. ఇక ఈ మోషన్ పోస్టర్‌ లో ఉన్ని ముకుందన్ సిగార్ పట్టుకుని యాక్షన్ మోడ్‌ లో ఉన్న లుక్ లో కనిపించాడు.2024 లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీని క్యూబ్స్ ఎంటర్‌టైనర్ బ్యానర్‌ పై షరీఫ్ మహ్మద్ అబ్దుల్ గదాఫ్ భారీ బడ్జెట్ తో ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు..అలాగే ప్రేమమ్ సినిమా హీరో నివిన్ పాలీ ఈ సినిమా లో ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది .ఈ మూవీ తో ఉన్ని ముకుందన్ మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.