తిరుమల తిరుపతిలో కిడ్నాప్ కలకలం రేపుతుంది. తిరుమల ఆర్టీసీ బస్టాండ్ లో రెండేళ్ల బాబు కిడ్నాప్ కు గురయ్యాడు. రాత్రి రెండు గంటల సమయంలో రిజర్వేషన్ కౌంటర్ దగ్గర కిడ్నాప్ చేశారు. అయితే, శ్రీవారి దర్శనానికి చెన్నైకి చెందిన కుటుంబం వచ్చింది. చెన్నైకి చెందిన చంద్రశేఖర్- మీనా దంపతుల రెండో కుమారుడు మురుగేశన్ గా గుర్తించారు. అర్ధరాత్రి 2.20 నిమిషాలు సమయం బాలుడు కిడ్నాప్ అయ్యాడు.. కిడ్నాపర్ వయస్సు 32 సంవత్సరాలు ఉండవచ్చు అని పోలీసులు తెలిపారు. కిడ్నాపర్ వైట్ షూ…గ్రీన్ కలర్ షర్ట్ తో వేసుకుని ఉన్నాడు.. రిజర్వేషన్ కౌంటర్ నుంచి బాలుడ్ని బస్టాండ్ బయట గల అంబేద్కర్ విగ్రహం వైపు వెళ్ళినట్లు క్లూస్ దొరికాయి.. కిడ్నాపర్ కోసం ప్రత్యేక టీంలతో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజ్‌లో చిన్నారి కిడ్నాప్ దృశ్యాలు..