Leading News Portal in Telugu

WhatsApp: ఇండియాలో 74 లక్షల అకౌంట్లపై వాట్సాప్ బ్యాన్..


WhatsApp: మెసేజింగ్ ఫ్లాట్‌ఫారమ్ వాట్సాప్ ఇండియాలో ఆగస్టు నెలలో 74.2 లక్షల అకౌంట్లపై బ్యాన్ విధించింది. 2021 కొత్త ఐటీ రూల్స్ ఆధారంగా వాట్సాప్ ఈ ఖాతాను నిషేధించింది. వీటిలో వినియోగదారుల నుంచి ఎలాంటి రిపోర్టు రాకముందే ముందస్తుగా 35 లక్షల ఖాతాలను బ్యాన్ చేశారు. సెప్టెంబర్ నెలలో మెటా యాజమాన్యం 72.28 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసింది. ఇందులో 3.1 లక్షల ఖాతాలు ముందస్తుగా నిషేధించబడ్డాయి.

‘అకౌంట్స్ యాక్షన్డ్’ అనేది కంపెనీ ఒక అకౌంట్ నిషేధించడానికి, పునరుద్ధరించడాన్ని సూచిస్తుంది. వినయోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని అకౌంట్లపై వాట్సాప్ నిషేధం విధిస్తోంది. ప్రభుత్వం ఈ ఏడాది గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ(జీఏసీ)ని అనే వ్యవస్థను ప్రారంభించింది. ఈ పోర్టల్ లో నమోదైన కంప్లైట్స్ ఆధారంగా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారం నిర్ణయాలపై అప్పీలు చేసుకోవడానికి వినియోగదారుడికి అనుమతి ఇస్తుంది. వాట్సాప్‌ని దుర్వినియోగం చేస్తున్న క్రమంలో యూజర్ సేఫ్టీ దృష్ట్యా, వినియోగదారుల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా సదరు అకౌంట్లపై కంపెనీ బ్యాన్ విధిస్తుంది.