Leading News Portal in Telugu

Naga Chaitanya-Samantha: విడాకుల తర్వాత మళ్ళీ కలవనున్న సామ్-చై.. ఇదే ప్రూఫ్ అంటూ వీడియో వైరల్!


Naga Chaitanya-Samantha Re union Soon: హీరోయిన్ సమంత, హీరో నాగ చైతన్య ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కారణాలు ఏమిటో తెలియదు కానీ పెళ్ళైన నాలుగేళ్ళకే ఇద్దరు మనస్పర్థల కారణంగా అధికారికంగా విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక వీరి విడాకులు అనంతరం రకరకాల చర్చలు జరిగాయి కానీ ఎందుకు విడాకులు తీసుకున్నారు అనే విషయం మీద ఎవరికీ క్లారిటీ లేదు. ఇప్పుడు ఎవరికి వారు తమ తమ జీవితాలను గడుపుతున్నారు. అయితే మధ్యమధ్యలో వీరు కలిసిపోతున్నారు అనే వార్తలు అప్పుడప్పుడు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు దానికి ఊతం ఇచ్చేలా ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలు విషయం ఏమిటంటే సమంత పెంచుకునే హాష్ అనే కుక్క నాగచైతన్య దగ్గర కనిపించింది. తన దగ్గర పని చేసే ఒక వ్యక్తి తాను కొన్న స్పోర్ట్స్ బైక్ ని నాగచైతన్య చేత స్టార్ట్ చేయించి వాడుకుందామని ఆయన దగ్గరకి తీసుకెళ్ళగా చైతూ ఆ బైక్ ని టెస్ట్ డ్రైవ్ చేసి తన సంతకం కూడా చేశాడు.

Siddharth: కర్ణాటక వెళ్లి ప్రెస్ మీట్ పెడితే నువ్వు ఎవడ్రా తమిళోడివి గెట్ అవుట్ అన్నారు

ఆ సమయంలో చైతూతో పాటు హాష్ కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సమంత పెంచుకునే హాష్ చైతూ దగ్గరికి ఎలా వచ్చింది అనే ప్రశ్నలు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరూ గొడవలు పక్కన పెట్టి కలుస్తున్నారనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే నిజానికి ఈ హాష్ ను నాగచైతన్య, సమంత కలిసే కొనుక్కుని తెచ్చుకుని పెంచుకున్నారు. ఈ క్రమంలోనే హాష్ ను నాగచైతన్య ఇంటికి అప్పుడప్పుడూ పంపిస్తూ ఉంటుందని, ఇద్దరితో హాష్ ఉండేలా ముందే అనుకున్నారని అంటున్నారు. హాష్ కి తోడుగా సమంత తరువాత సాషా అనే కుక్కపిల్లను కూడా తెచ్చి పెంచుకుంటోంది. అయితే హాష్ కామన్ విజిట్స్ లో భాగంగా సమంత దగ్గర నుంచి చైతూ దగ్గరకు వచ్చిందా? లేక నిజంగానే ఇద్దరూ కలవబోతున్నారా? అనేది తెలియాలంటే వారిద్దరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.