Shooting at Shopping Mall: థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ఓ లగ్జరీ మాల్‌లో జరిగిన కాల్పుల్లో కనీసం ముగ్గురు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారని పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ ఘటనలో 14 ఏళ్ల అనుమానిత సాయుధుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో, మెట్రోపాలిటన్ పోలీస్ డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్ సియామ్ పారగాన్ మాల్‌లో నిందితుడిని అరెస్టు చేసినట్లు ప్రకటించింది. అంతకుముందు, సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తన ఫేస్‌బుక్ పేజీలో ఖాకీ కార్గో ప్యాంటు, బేస్ బాల్ క్యాప్ ధరించి ఉన్న ఓ వ్యక్తి గ్రైనీ చిత్రాన్ని పోస్ట్ చేసింది.
సోషల్ మీడియాలో ధృవీకరించబడని వీడియోలు గందరగోళ దృశ్యాలను చూపించాయి. పిల్లలతో సహా ప్రజలు మాల్ తలుపుల నుంచి బయటకు పరుగులు తీస్తుండగా, సెక్యూరిటీ గార్డులు వారిని ప్రాంగణం నుంచి బయటకు వెళ్లడానికి సహాయం చేశారు.ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని స్రెట్టా థావిసిన్.. సియామ్ పారగాన్‌లో జరిగిన కాల్పుల ఘటన గురించి దర్యాప్తు చేయవలసిందిగా పోలీసులను ఆదేశించినట్లు వెల్లడించారు. ప్రజా భద్రత గురించి తాను చాలా ఆందోళన చెందుతున్నానని ట్విట్టర్ వేదికగా తెలిపారు.